బాలీవుడ్ పై నోరు పారేసుకున్న కంపు ట్రంప్

Donald Trump controversial comments

12:05 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Donald Trump controversial comments

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ట్రంప్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అందరి నుంచి నిరసనలు ఎదుర్కొంటున్నా, మార్పు ఏమాత్రం కన్పించడం లేదు సరికదా , ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలనే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటులను టార్గెట్ చేస్తూ మాట్లాడి వివాదంలో మునిగి తేలుతున్నాడు. ప్రతీ భారతీయ నటుడు హాలీవుడ్ రేంజ్‌కు ఎదగాలని కలలు కనడం సహజం. హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వస్తే వెంటనే సై అంటారు. అయితే ఇకపై భారతీయ నటులు ‘హాలీవుడ్’ ఆశలు నెరవేరే పరిస్థితులు ఉండకపోవచ్చు. అది కూడా . ట్రంప్ ప్రెసిడెంట్ అయితే సుమా.. అసలు భారతీయ నటులను అమెరికాకు రానివ్వకపోవచ్చు ఆయన గారు ... . ఎందుకంటే తాను ప్రెసిడెంట్‌ను అయితే భారతీయ నటులు అమెరికా థియేటర్ తెరలపై కనిపించకుండా హాలీవుడ్‌కు పెద్ద అడ్డుగోడ కడతానని ఓ సభలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇంకా ట్రంప్ ఏమన్నారంటే. 'మనకు ఓ సమస్య ఉంది. చాలామంది మిత్రులు, అమెరికన్లు నన్ను ఓ సాయం కోరుతున్నారు. వాళ్లు సరదాగా సినిమా థియేటర్‌కు వెళ్లినపుడు ఆ తెరలపై అమెరికన్లు కనిపించడం లేదని వాపోతున్నారు. ఈ విషయంపై ఏదో ఒకటి చేయమని నన్ను కోరారు. ఇప్పటికే సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు ఇండియన్ సీఈవోలతో నిండిపోయాయి. హాలీవుడ్‌లో కూడా భారతీయ ముఖాలే కనిపిస్తున్నాయి. దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రా, అనీల్ కపూర్ వంటి వారు చాలా మంది ఈ తెరపై కనిపిస్తున్నారు. అనిల్ కపూర్ అనే వ్యక్తి అయితే హాలీవుడ్‌లో కనిపించేందుకు కేటరింగ్ బాయ్‌గా కూడా నటిస్తాడు. వాళ్లు ఆస్కార్‌కు అటెండ్ అవుతారు. అందుకే బాలీవుడ్ వాళ్ళు రాకుండా అడ్డుగోడ కట్టేస్టా’ అని ట్రంప్ ప్రసంగం సాగించాడు.

తన స్నేహితులతోపాటు, పలువురు నటులు కూడా తమకు ఉద్యోగాలు లభించడంలేదని వాపోయారని ట్రంప్ పేర్కొంటూ, ప్రియాంకా చోప్రా తన అవకాశాన్ని తీసుకుందనో, ఇర్ఫాన్ ఖాన్ తన స్థానాన్ని భర్తీ చేస్తున్నారనో వారు వాపోతున్నారని ఆయన అన్నారు. వారి బాధలను తనకు అర్థం అయ్యాయనీ, అందుకే హాలీవుడ్‌లోకి వారు రాకుండా పే.....ద్ద గోడను నిర్మించాలని నిర్ణయించుకున్నానన్నారు. న్యూయార్క్‌లోని స్కైస్కాపర్ కంటే పెద్ద గోడను నిర్మిస్తానని సభికులకు హామీ ఇచ్చారు. ఆయన ఈ మాట అనగానే అభిమానుల నుంచి పెద్దపెట్టున హర్షద్వనాలు ట్రంప్‌కు లభించాయి. ‘దీన్ని మనం చైనాతో నిర్మింపజేయం.. దీనిని అమెరికన్లతోనే నిర్మిస్తాం. మీకు తెలుసా.. దీనికి అయ్యే ఖర్చును షారూక్‌ ఖాన్ భరించేలా చేద్దాం.. ’ అని ట్రంప్ అనేసాడు. ఎప్పుడూ ఎవరో ఒకరి మీదా ఇలా పడుతుంటే ఓట్లు కుప్పలు తెప్పలుగా పడతాయని అనుకుంటున్న ట్రంప్ కి రివర్స్ గేర్ తప్పదేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Donald Trump most controversial comments