అమెరికా వెళ్లాలంటే అన్నీ ఇచ్చేయాలట - ట్రంప్ తాజా నిర్ణయం

Donald Trump decision shocks to immigrants

06:42 PM ON 31st January, 2017 By Mirchi Vilas

Donald Trump decision shocks to immigrants

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఇరాక్ , సిరియా, ఇరాన్ , లిబియా, సొమాలియా, సుడాన్ , యెమెన్ దేశాల వలసదారుల ప్రవేశాన్ని 90 రోజులపాటు నిరోధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఇప్పటికే దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వచ్చిపడుతున్నాయి. అయినా వెనక్కి తగ్గకుండా, ఇప్పుడు దేశంలోకి ప్రవేశించే విదేశీయులకు కొన్ని కొత్త షరతులను విధించే అంశాన్ని ఆయన ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమెరికాకు వచ్చే విదేశీయులు వారి ఫోన్ నంబర్లను, సామాజిక మీడియా వివరాలను, ఇంటర్నెట్ లో వారు అన్వేషించిన అంశాలను సూచించే ‘బ్రౌజింగ్ హిస్టరీ’ని అందజేయాలనే షరతులను విధించే అవకాశాలపై అధికార యంత్రాంగం చర్చిస్తోందని వైట్ హౌస్ విధాన సంచాలకుడు స్టీఫెన్ మిల్లర్ ఆదివారం వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని అమలు సాధ్యాసాధ్యాలపైనా ఇంకా స్పష్టత రాలేదు. వ్యక్తిస్వేచ్ఛకు, వ్యక్తిగత అంశాల్లో గోప్యతకు మద్దతిచ్చేవారు ఇలాంటి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంద ని విశ్లేషకులు అంటున్నారు. అయితే అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే ‘గ్రీన్ కార్డు’ కలిగివున్నవారి ప్రవేశం దేశానికి ప్రయోజనకరమేనని అంతర్గత భద్రతశాఖ(డీహెచ్ ఎస్ ) స్పష్టం చేసింది. భద్రత తనిఖీల అనంతరం వారిని దేశంలోకి అనుమతిస్తామని తెలిపింది.

ఇది కూడా చూడండి: టైగర్ ని ఓ ఆట ఆడించిన బాతు(వీడియో)

ఇది కూడా చూడండి: బాప్ రే , అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయట.?

English summary

America President Donald Trump decision creates shocking to all immigrants.