ఎలిజబెత్ ని ట్రంప్ ఎంతమాట  అనేసాడు ...

Donald Trump Fires On Elizabeth Warren

10:22 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Donald Trump Fires On Elizabeth Warren

ఎలాగోలా ‘ప్రెసిడెంట్’ అని పిలిపించుకోవాలని తెగ తాపత్రయ పడిపోతున్న ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు. ఎవరినీ వదిలి పెట్టకుండా తన నోటికి పని చెప్పేస్తున్నాడు. ఇదే క్రమంలో తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి మస్సాచుసెట్స్ సెనేటర్, డెమొక్రటిక్ నేత ఎలిజబెత్ వారెన్‌ ని టార్గెట్ చేసుకుని , తీవ్రమైన ఆరోపణలు గుప్పించాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రశ్నించారు.

భారతీయులకు ఉద్యోగాలిచ్చే అంశంపై విలేకరి ప్రశ్నించగా.. భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగమనీ, ఇకపై జరిగే అభివృద్ధిలో కూడా భాగంగా వారు ఉంటారంటూ ఎలిజబెత్ జాతీయతపై కామెంట్స్ చేశారు. తన కంటే ఎక్కువగా ఎలిజబెత్‌లో భారతీయ రక్తం ఉందంటూ ఆరోపించారు. 2012 ఎన్నికల సమయంలో ఎలిజబెత్ స్థానికత గురించి పెద్ద దుమారం చెలరేగింది. తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించి హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ అయ్యారనీ, తాను మైనారిటీనని చెబుతూ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన విమర్శలను ఎలిజబెత్ ఖండించారు. ట్రంప్‌ నుంచి అమెరికాను రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రంప్‌ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక చేస్తే రిపబ్లికన్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తానికి వివాదం ద్వారా అందలమెక్కాలని చూస్తున్న ట్రంప్ ఆశలు ఫలిస్తాయో , వికటిస్తాయో చూడాలి మరి .

సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

హిట్లర్ ఇన్నాళ్ళకు తండ్రి అయ్యాడా

స్కిన్ ట్యాగ్ తొలగించుకోవటానికి చిట్కాలు

అఫ్రిది వల్ల నాకు కడుపొచ్చింది

English summary

America President candidate Donald Trump commented Elizabeth Warren by saying that she was not American and he says that Indians are the part of America. Elizabeth warren also responded to Donald Trump comments on Social Media