జైలుకి పోతావ్ .. హిల్లరీ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Donald Trump Fires On Hillary Clinton

02:52 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Donald Trump Fires On Hillary Clinton

అమెరికా అధ్యక్ష పదవికి ఫైనల్ అభ్యర్థుల్ని అధికారికంగా ఎంపిక పూర్తి కానప్పటికీ.. రిపబ్లికన్ల తరఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ల తరపున హిల్లరీక్లింటర్ అన్న విషయం దాదాపుగా తేలిపోవడంతో ఎన్నికలు మరింత రంజుగా మారాయి. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. ఇరువుర మధ్య మాటల తూటాలు పేలుతూ, ఓ రకంగా మాటల దాడి రోజురోజుకీ తీవ్రమవుతోంది. హిల్లరీకి జత కలిసి అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్లీ నిన్నటికి నిన్న ట్రంప్ మీద తీవ్ర విమర్శలు చేసింది.

ట్రంప్ కారణంగా అమెరికా పరపతి నాశనం కావటంతో పాటు.. ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయితే నియంతగా మారే ప్రమాదం ఉందని మిచెల్లీ హెచ్చరిస్తున్నారు. ఇక నోరు విప్పితే మనిషి కానన్నట్లు ప్రవర్తించే ట్రంప్ ఇప్పటికే పలు అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఎవరినీ వదిలి పెట్టకుండా విమర్శల జడివాన కురిపిస్తున్న ట్రంప్ తాజాగా తన ప్రత్యర్థిగా భావిస్తున్న హిల్లరీ క్లింటన్ మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు. తన ప్రధాన పోటీదారుగా భావిస్తున్న హిల్లరీ క్లింటన్ కు జైలు తప్పదని అనడంతో అంతా నిర్ఘాంత పోతున్నారు.

కాలిఫోర్నియాలో తన మద్దుతుదారులతో సమావేశమైన సందర్భంగా ఈ మొయిల్ కుంభకోణంలో ఆమె జైలులకు వెళ్లటం ఖాయమని ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. గతంలోనూ హిల్లరీ మీద ఈ మొయిల్ ఆరోపణల్ని చేసినప్పటికీ.. తాజాగా తీవ్రస్థాయిలో మండిపడటం చూసినప్పుడు ఈ మొయిల్ ఆరోపణల విషయంలో హిల్లరీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అన్న సందేహం కలగటం ఖాయం. ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై హిల్లరీ పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా వ్యాఖ్యలతో హిల్లారీ ఎలాంటి రియాక్షన్ చూపిస్తారో చూడాలి. మొత్తానికి అమెరికా ఎన్నికల పుణ్యమా అని లోకానికి కొన్ని నిజాలు కూడా తెలుస్తున్నాయ్.

English summary

American Presidential Candidate Donald Trump Fires On Hillary Clinton fires on his competitor Hillary Clinton.