చెర్రీ, అఖిల్ ఈవెంట్ కి ట్రంప్?

Donald Trump is coming to charitable event

12:39 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Donald Trump is coming to charitable event

ఇదేమిటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కిన వ్యక్తి, మన టాలీవుడ్ హీరోల కార్యక్రమానికి వస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. ఇంతకీ అదేమిటంటే, అక్టోబర్ 15న న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్ సెంటర్ లో హ్యుమానిటీ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్ అనే చారిటీ కార్యక్రమం జరగబోతోంది. ఉగ్ర బాధితులకు విరాళాలు సేకరించడానికి జరగనున్న ఈ కార్యక్రమంలో తెలుగు నటులు రామ్ చరణ్, అఖిల్, శ్రియలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరుకాబోతున్నట్లు టాక్.

ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోయే ముందు ప్రచార కార్యక్రమం నిమిత్తం ట్రంప్ ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ ఈవెంట్ లో మలైకా అరోరా ఖాన్, ప్రభుదేవా, సోఫీ చౌదరిలు కూడా పాల్గొననున్నట్లు చెబుతున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.

English summary

Donald Trump is coming to charitable event