సద్దాంను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్

Donald Trump praises Saddam Hussein

01:22 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Donald Trump praises Saddam Hussein

ఇప్పటికే ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ పలువురునుంచి నిరసనలు ఎదుర్కొన్నాడు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పై ప్రశంసల వర్షం కురింపించాడు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్ గతంలో కూడా సద్దాం హుస్సేన్, లిబియాకు చెందిన గడాఫీ వంటి డిక్టేటర్లు ఇంకా పరిపాలన చేసి ఉంటే ప్రపంచం వంద శాతం బెటర్ గా ఉండేదని వివాదాస్పదంగా మాట్లాడారు. సద్దాం ఉగ్రవాదులను బాగా హతమార్చాడని ఆకాశానికి ఎత్తేసాడు. నార్త్ కెరోలినాలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఇరాక్ మాజీ అధ్యక్షుడి ప్రస్తావన తీసుకొచ్చారు.

సద్దాం హుస్సేన్ చెడ్డ వ్యక్తి.. కానీ అతడు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు అని వ్యాఖ్యానించారు. సద్దాం హుస్సేన్ ను ప్రశంసించడం పట్ల డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సీనియర్ పాలసీ అడ్వైజర్ జేక్ సుల్వీవాన్ తీవ్రంగా విమర్శించారు. అతడు అమెరికా అధ్యక్షుడు కావడం ఎంత ప్రమాదకరమో తెలుస్తోందన్నారు. ట్రంప్ కోరకుంటున్న పదవికి అతడు ఏమాత్రం సరిపోడని విమర్శించారు. ఇంకా ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడో ట్రంప్.

English summary

Donald Trump praises Saddam Hussein