పాక్‌ను అదుపులో పెట్టేందుకు భారత్ సాయం

Donald Trump Says Indias Help To Keep Pakistan In Limits

11:07 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Donald Trump Says Indias Help To Keep Pakistan In Limits

పాకిస్థాన్‌ అస్థిర దేశమని, దాని చేతిలో ఉన్న అణ్వస్త్రాలే అసలు సమస్యని రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.ఆ దేశాన్ని అదుపులో పెట్టేందుకు భారత్ సాయం తీసుకుంటానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఆయన.చెప్పుకొచ్చారు. గురువారం ఇండియానాపొలిస్‌ టౌన్‌హాల్‌లో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. సభికుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ తన విదేశాంగ విధానాన్ని విశదీకరించారు. ‘మనం పాక్‌కు నిధులిస్తున్నాం. అదేమో మనల్ని వంచిస్తోంది. దాని వద్ద ఉన్న అణ్వాయుధాలే అతిపెద్ద సమస్య.

ఇవి కూడా చదవండి: మగాడ్ని రేప్ చేసి దాన్ని ఎత్తుకెళ్ళారు(వీడియో)

ప్రస్తుతం సగం అస్థిరతతో ఉంది. పూర్తిగా అస్థిరపడాలని కోరుకోవడం లేదు. ఆ దేశంతో మనకు సత్సంబంధాలే ఉన్నాయి. వాటిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తా. మనం దానికి నిధులిచ్చి సాయపడాలి. లేదంటే ఘోర విపత్తు సంభవిస్తుంది. భారత, మరికొన్ని దేశాలు మనకీ విషయంలో సాయం చేయొచ్చు. ఎన్నో దేశాలకు మనం నిధులిస్తున్నాం. కానీ మనకెలాంటి ప్రతిఫలం దక్కడం లేదు. దీనికి సత్వరమే ముగింపు పలకాలి’ అని ట్రాంప్ చెప్పారు. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గత ఎనిమిదేళ్లుగా అనుసరిస్తున్న విధానాల కారణంగా అమెరికా బలహీనపడిందన్నారు. తాను అధ్యక్షుడినైతే రాడికల్‌ ఇస్లాం వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టంచేశారు. ‘‘ఇరాక్‌, లిబియా, సిరియాల్లో మన చర్యలు ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు ప్రాణం పోశాయి. రాడికల్‌ ఇస్లాంపై మనం పోరాటం చేయాల్సి వస్తోంది. అధ్యక్షుడు ఒబామా కనీసం మన శత్రువు పేరును కూడా ప్రస్తావించరు’ అని మండిపడ్డారు. రోజుకొక వివాదాస్పద ప్రకటన చేసే ట్రంప్ ఈసారి పాక్ తీరుని ఎండగట్టడం విశేషం .

ఇవి కూడా చదవండి:తనతో పెళ్ళికి ఒప్పుకోలేదని కారులోనుంచి తోసేశాడు

ఇవి కూడా చదవండిక్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

English summary

American Presidential Candidate Donald Trump Says ina Event that they will take India's Help to Kepp Pakistan in Limits. He said that they will fight on Terrorism in Pakistan and other Countries.