క్లింటన్ ఓ సెక్స్ ప్రెడేటర్ అంటున్న ట్రంప్

Donald Trump shocking comments on Bill Clinton

12:47 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Donald Trump shocking comments on Bill Clinton

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి క్లింటన్ కుటుంబంపై నోరుపారేసుకున్నాడు. అంతేకాదు హెచ్చరికలకు దిగాడు. పెన్సెల్వేనియాలో జరిగిన ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్ 11 ఏళ్లనాటి తన సంభాషణను రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా కూడా అతి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు చెప్పిందే చెబుతూ వార్తలు ప్రచురిస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ మానుకోకపోతే వారికే నష్టమని హెచ్చరించారు. ఈ విషయంలో తాను రెండుసార్లు క్షమాపణలు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. తన వీడియోలను బహిరంగం చేస్తామని చెబుతున్నారని, అదే కనుక జరిగితే హిల్లరీ కుటుంబానికి చెందిన వీడియోలు విడుదల చేస్తానని హెచ్చరించారు.

హిల్లరీ వెనక మీడియా లేకుంటే ఆమె నిజ స్వరూపం బయటపడుతుందని అన్నారు. మీడియా ఆమె వెనక లేకుంటే కుక్కలు పట్టే ఉద్యోగం కూడా హిల్లరీకి దొరకదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఓ సెక్స్ ప్రిడేటర్(జంతువులను చంపితినే జంతువు)గా అభివర్ణించారు. మహిళలను ఆయన వేధించినంతంగా మరెవరూ వేధించలేదన్నారు.

English summary

Donald Trump shocking comments on Bill Clinton