చరిత్రలో చెత్త ప్రెసిడెంట్ ఒబామాయే: చెలరేగిన ట్రంప్

Donald Trump shocking comments on Obama

03:50 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Donald Trump shocking comments on Obama

ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఎక్కిన, అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేకెత్తించాడు. ఈసారి ఏకాంగా దేశాధ్యక్షుడుని టార్గెట్ చేసాడు. ప్రెసిడెంట్ ఒబామా ఓ భయంకరమైన వ్యక్తి.. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా ఆయన పదవి నుంచి దిగిపోతారు అంటూ ట్రంప్ చెలరేగిపోయాడు. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి(ట్రంప్) సరైన వ్యక్తి కాదంటూ ఒబామా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని ట్రంప్ ను మీడియా అడగడంతో ఒబామాపై ట్రంప్ గురిపెట్టాడు.

నాకు నామినేషనే రాదని ఒబామా ఒకప్పుడు చెప్పా రు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవబోడని చెబుతున్నారు. మరి కొద్ది రోజులైతే ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడని ఒబామా చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.

హల్లరీని అందుకే దెయ్యంతో పోల్చా..

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అబద్ధాలు చెబుతారని, ప్రజలను మోసం చేస్తున్నారని అందుకే ఆమెను దెయ్యంతో పోల్చానని చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. ఇక ట్రంప్ ఆదాయపన్ను వివరాలపై వారెన్ బఫెట్ చేసిన సవాలు గురించి అడగ్గా.. అసలు తనకు వారెన్ బఫెట్ ఎవరో తెలియదని, ఆయన్ను ఇంతవరకు కలవలేదని స్పష్టం చేశారు. నవంబర్ లో ఎన్నికలు జరగబోయేలోగా ఇంకా ఎన్ని వివాదాలు ముసురుకుంటాయో చూడాలి.

English summary

Donald Trump shocking comments on Obama