ఇండియాలో స్వర్గ ధామం 'ట్రంప్ టవర్స్' (వీడియో)

Donald Trump To Build Luxury Realty Projects In India

10:47 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Donald Trump To Build Luxury Realty Projects In India

ఇదేమిటి అనుకుంటున్నారా? మరి అదే విచిత్రం. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరితో తలపడుతూ, ఘాటైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన దేశంలోనే కాదు, ఇండియాలోనూ పాపులర్ కావాలనుకుంటున్నాడు. అందుకే ముంబైలో ఏకంగా తన పేరిట "ట్రంప్ టవర్స్" అంటూ అతి భారీ కట్టడం నిర్మించాలని యోచిస్తున్నాడట. చూడబోతే.. ప్రపంచంలో తానో రియల్ ఎస్టేట్ రారాజు కావాలని భావిస్తున్నట్టున్నాడు. సుమారు మూడేళ్ళలో ఇండియాలో ఈయన ప్రాజెక్టులు రెండు భారత్ లో లాంచ్ కానున్నాయి. ఇండియాలోనే ట్రంప్ టవర్స్ లాంటి కట్టడం ఇదే మొదటిదవుతుంది.

కేవలం బిలియనీర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ టవర్ విశేషాలు తెలుసుకుంటే వావ్ అంటారు. 800 అడుగుల ఎత్తయిన ఈ టవర్ కి బంగారపు పూత ఉంటుందట. 17 ఎకరాల పార్క్ ల్యాండ్ లో.. 75 అంతస్తులతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుమారు 400 అపార్ట్ మెంట్లు ఉంటాయి. మూడు బెడ్ రూమ్ ల ఫ్లాట్ రూ.9.10 కోట్లు, 5 బెడ్ రూమ్ ల ప్లాట్ రూ.10.5 కోట్లు ఖరీదు చేస్తాయని.. 2018 నాటికి ఈ టవర్ నిర్మాణం పూర్తి కావచ్చునని దీని నిర్మాణ బాధ్యతలు చూస్తున్న లోధీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, మార్కెటింగ్ హెడ్ సముజివాల్ ఘోష్ అంటున్నారు. ఈ టవర్స్ లో ఉన్నవారికి ప్రైవేట్ జెట్ సర్వీస్ సౌకర్యం కూడా ఉంటుందంటున్నారు.

క్రికెట్ పిచ్, థియేటర్, ఏడంచెల సెక్యూరిటీ వ్యవస్థ, స్పా బాత్ లు, స్విమ్మింగ్ పూల్, పిక్నిక్ స్పాట్స్ వంటి హంగులన్నీ ఈ టవర్స్ లో ఉంటాయి. ట్రంప్ కు సన్నిహితులైనవారిలో ఎంతోమంది సిఈవోలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు ఉన్నారని, వారితో ఆయన టచ్ లో ఉంటారని సముజివాల్ తెలిపారు. ఈ టవర్స్ పూర్తయితే అది మరో స్వర్గ ధామం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే నెటిజన్లు కామెంట్స్ కూడా పెట్టేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:రూ. 1000కే జనతా బుల్లెట్.. కాంటెస్ట్ తో ఫాన్స్ కి బంపరాఫర్!

ఇవి కూడా చదవండి:హుస్సేన్ తో రెచ్చిపోయిన రాధిక(వీడియో)

English summary

American Republican Presidential candidate Donald Trump was a big Real Estate Business in the world and now he was planning to Build Luxury Realty projects in India and he selected Mumbai for his first project in India.