తిడుతూనే ...ఇండియాపై  కన్నేసిన ట్రంప్

Donald Trump To Expand Business In India

05:38 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Donald Trump To Expand Business In India

రాజకీయం వేరు , వ్యాపారం వేరు , సంబంధాలు వేరు ... ఇలా చెబుతారు ... కానీ ఈవన్నీ ఏకకాలంలో సాగిస్తూ అందరినీ కనఫ్యూజన్ లో పడేయడంలో ప్రస్తుతం ఓ వ్యక్తి చాకచక్యం గా వ్యవహరిస్తున్నారు. అతనెవరో కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు పబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్.... తన కామెంట్లతో ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈయన వివాదాస్పద వ్యాఖ్యలతో దూసుకుపోతున్నారు ... తాను గెలిస్తే భారతీయులను తరిమేస్తానని ట్రంప్ చెప్పిన ట్రంప్ భారత్ కు దూరంగా ఉంటున్నారా అదీ ఒట్టి మాటేనని తేలిపోయింది. భారత్ లో బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తున్న ట్రంప్ అమెరికాలో పెద్ద బిలియనీర్. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు ఇండియాలోనూ తన రియల్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ట్రంప్ పెద్దపెద్ద ప్లాన్లే వేస్తున్నారు. అమెరికన్లను మభ్యపెట్టడానికి ఎన్నికల సందర్భంగా ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ ఇండియాలో రియల్ వ్యాపారాన్ని మాత్రం బ్రహ్మాండంగా సాగిస్తున్నారు. అంతేకాదు.... మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కుడా చదవండి:ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

ఇప్పటికే ట్రంప్ కుమారుడు పుణె - ముంబయిల్లో రెండు భారీ రియల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. పుణెలో రెండు టవర్లలో 46 బ్లాకుల్లో అపార్టుమెంట్లు కడుతున్నారట. ముంబయిలో లోధా గ్రూపుతో కలిసి 300 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఉత్తరాదిలోను - ఈశాన్య రాష్ట్రాల్లోనూ రియల్ ప్రాజెక్టులు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ - బెంగళూరు - చెన్నై - హైదరాబాద్ - పుణెల్లో లగ్జరీ అపార్టుమెంట్ల నిర్మాణానికి ట్రంప్ కుమారుడు పెద్ద ఎత్తున వ్యవహారాలు డీల్ చేస్తున్నారు. వీటితో పాటు హాస్పిటాలిటీ - గోల్ఫ్ కోర్సులు- కాసినోవాల వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు జూనియర్ ట్రంప్ రెడీ అయిపోతున్నాడు. ఈ లెక్కన ఇండియా ట్రంప్ కు చాలా కీలకమే.. ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడైతే ఇండియాతో మంచి సంబంధాలు నెరుపుతారని భావిస్తున్నారు. ఎందుకంటే మోడీ ప్రధాని అయినప్పుడు ట్రంప్ ఇండియాకు ప్రత్యేకంగా వచ్చి మోడీని ప్రత్యేకంగా అభినందించి వెళ్ళారు.. భవిష్యత్తులో భారీగా ఇండియాలో పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో ట్రంప్ ఎన్నికల కోసం ఎన్ని మాటలు చెప్పినా ఇండియాపై . ఆయన లెక్కలు ఆయన్కున్నాయని , ఇండియా మార్కెట్ ఒదులు కోడని స్పష్టం అవుతోంది.

ఇవి కుడా చదవండి:

‘అన్నమయ్య పాటకి పట్టాభిషేకం

ప్రభాస్ ని అక్కడికి రమ్మని చెప్పు

శ్రీజ పెళ్లిలో పవన్ మూడో భార్య

English summary

American Presidential Candidate Donald Trump To Expand His Business In India. Donald Trump was a big Real Estate Business typhoon. He was planning to Build Construct Luxurious Apartments In India.