అమెరికా అధ్యక్ష పీఠం ట్రంప్ కైవసం

Donald Trump won in elections

06:31 PM ON 9th November, 2016 By Mirchi Vilas

Donald Trump won in elections

అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. సాధించినట్టు అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. మొత్తం 50 రాష్ట్రాల్లోని 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గానూ ట్రంప్ కు 288 ఓట్లు, హిల్లరీకి 215 ఓట్లు నమోదయ్యాయి. అధ్యక్ష స్థానాన్ని పొందాలంటే కనీసం 270 ఓట్లు పొందాలి. ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీకి అవసరమైన 288 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించి ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అనూహ్య పరాజయాన్ని చవిచూశారు. ట్రంప్ విక్టరీపై సంబరాలు మొదలైపోయాయి.

1/7 Pages

కల్సి పనిచేద్దామన్న ట్రంప్...


'అమెరికా ఎప్పుడూ నెంబర్ వన్. అమెరికా ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తాం. అమెరికా పునర్నిర్మాణంలో అహర్నిశలు పనిచేస్తా. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తా. నన్ను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు' అని అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన ట్రంప్ ప్రకటించారు.

English summary

Donald Trump won in elections