అక్రమ వలసదారులు వెళ్లిపోవాల్సిందే: ట్రంప్‌

Donald Trupm Says Illegal Immigrants Should Leave Country

04:34 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Donald Trupm Says Illegal Immigrants Should Leave Country

అమెరికా అధ్యక్ష పదవి రేస్ లో ముందున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్ట్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పీఠంలోకి వస్తే అమెరికాలో స్థిరపడిన అక్రమ వలసదారులంతా వెనక్కి వెళ్లిపోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు కోటీ పది లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నట్లు ఒక అంచనా. వారిలో మూడు లక్షల మంది వరకు భారతీయులు ఉన్నారు. అయితే తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వారంతా వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని ట్రంప్‌ హెచ్చరించారు. మంచివారు ఉంటే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తిరిగి రావొచ్చని, అయితే ఇది వెంటనే జరగదని, ఆ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని చెప్పారు. ఒకవేళ తాను అధికారంలోకి వస్తే మాత్రం అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. అమెరికాలో అక్రమ వలసలు రాకుండా దక్షిణ సరిహద్దు వెంబడి భారీ గోడను నిర్మించాలని సూచించారు. మార్చి 1న అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ఎన్నికకు కీలకమైన సూపర్‌ ట్యూస్‌డే కార్యక్రమం జరగనుంది. ఇటువంటి సమయంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది.

English summary

Donald Trump is calling for the deportation of millions of immigrants living in the U.S. illegally and for the end of automatic citizenship for children born to foreigners on U.S.