మగవాళ్ళు వీర్యం దానం చేస్తే .. క్యాష్ లేదా ఐ ఫోన్ గిఫ్ట్!

Donate sperm and get iphone

11:31 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Donate sperm and get iphone

అన్ని దానాలలో అన్నదానం గొప్పదని, విద్యాదానం గొప్పదని ఇలా వింటుంటాం కానీ ఇదేమిటి అనుకుంటున్నారా? నిజం... ఇంతకీ ఎక్కడంటే చైనాలో... అక్కడ 20 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న మగవారికి అక్కడి స్పెర్మ్ బ్యాంకులు ఇస్తున్న ఆఫర్ ఇది. మీ దేశం కోసం దయచేసి మీ వీర్యం ఇవ్వండంటూ బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది. కారణాలు ఏవైతేనేం వీర్యం దొరక్క అక్కడి స్పెర్మ్ బ్యాంకులు తెగ ఇబ్బంది పడుతున్నాయి. దీంతో వీర్యం దానం చేసే యువత కోసం కొత్త కొత్త ఆఫర్లు పెడుతున్నాయి. వెయ్యి డాలర్ల క్యాష్ లేదంటే రోజ్ గోల్డ్ ఐఫోన్ ఇస్తామంటూ ఆకర్షిస్తున్నాయి.

ఈ మధ్యే రెండో సంతానానికి కూడా చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వారి కష్టాలు మరింత పెరిగాయి. దీనివల్ల వీర్యం దానం చేసే వారి సంఖ్య మరింత తగ్గిపోయింది. కొన్ని స్పెర్మ్ బ్యాంకులైతే దేశభక్తి అంశాన్ని తెర పైకి తెస్తున్నాయి. దేశంలో వయసు మీరుతున్నవారి సంఖ్య ఎక్కువవుతున్న ఈ సమయంలో మీ వీర్యమే దేశాన్నికాపాడుతుందంటూ యువకులకు సందేశాలు ఇస్తున్నాయి.

English summary

Donate sperm and get iphone