అక్కడ గాడిదలకు డైపర్స్ తప్పనిసరి

Donkeys ordered to wear diapers in Kenya

12:43 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Donkeys  ordered to wear diapers in Kenya

అవునా, మనకి కోపం వస్తే , గాడిదా అని తిట్టేస్తాం కదా , అలాంటి గాడిదలు కాదండి బాబూ , నిజం గాడిదలే. కెన్యాలోని ఓ నగర పాలక వర్గం గాడిదలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించకుంటే మాత్రం నగరంలోకి రానిచ్చేది లేదని హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇకపై నగరంలోకి వచ్చే ప్రతీ గాడిద కచ్చితంగా డైపర్ వేసుకోవాల్సిందే. లేకపోతే వాటికి సిటీలోకి నో ఎంట్రీ అంటూ ఆదేశించింది.

కెన్యాలోని వాజిర్ నగర ప్రజలు ఎక్కువగా రవాణ, వ్యాపారం కోసం గాడిదలనే ఉపయోగిస్తుంటారు. అందుకే అక్కడ మనుషుల సంఖ్యకు కాస్త అటూ ఇటుగా గాడిదలు కూడా ఉంటాయి. ఆ గాడిదలతో ఆ నగరానికి పెద్ద సమస్య వచ్చిపడింది. ఇటీవలె ఆ నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా రోడ్లు వేశారు. అయితే ఈ గాడిదల ఎక్కడ పడితే అక్కడ మల, మూత్ర విసర్జన చేస్తుండడంతో ఆ రోడ్లన్నీ వేసిన రెండ్రోజులకే దరిద్రంగా మారిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నడవడానికి కూడా వీలు లేకుండా వ్యర్థాలతో నిండిపోయి. ఆ సమస్యను నిరోధించడానికే గాడదలకు తప్పనిసరిగా డైపర్స్ వేయాలని వాటి యజమానులను నగర పాలక సంస్థ ఆదేశించింది. లేకపోతే వాటిని నగరం లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. భలే వుంది కదా.

ఇది కూడా చూడండి:తుది శ్వాస విడిచిన బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ

ఇది కూడా చూడండి:కృష్ణవంశీ సినిమాలో బికినీ వేస్తుందట!

ఇది కూడా చూడండి:విష్ణు హీరోగా 'అసెంబ్లీ రౌడీ' రీమేక్

English summary

Donkeys ordered to wear diapers in Kenya.