అమ్మాయిల రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేస్తే ఇక అంతే!

Don't accept facebook requests from unknown girls

04:19 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Don't accept facebook requests from unknown girls

సరిహద్దుల్లో పని చేస్తున్న అధికారులు, జవాన్లు మొబైల్ యాప్ ల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలట. పాకిస్తాన్, చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు కొన్ని యాప్ ల ద్వారా మొబైల్ లోని సమాచారాన్ని తస్కరించాలని ప్రయత్నిస్తున్నారట. అంతే కాకుండా ఎవరైనా తెలియని వారి నుంచి ముఖ్యంగా అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయవద్దట. ఈ మేరకు స్పష్టమైన హెచ్చరికలు ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ క్రిష్ణ చౌదరి జారీ చేసారు. భారత భద్రతాదళాల కీలక సమాచారాన్ని తస్కరించడానికి పొరుగు దేశాల గూఢాచార సంస్థలతో పాటూ పలు తీవ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

గూగుల్ ప్లే స్టోర్ లోని వీచాట్(WeChat), స్మెష్(Smesh), లైన్(Line)వంటి యాప్ లను అధికారులు, జవాన్లు వాడకూడదని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. జవాన్లు వాడే స్మార్ట్ ఫోన్ల నుంచే విదేశాలకు చెందిన గూఢచార సంస్థలు ఆన్ లైన్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించగలిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఈ యాప్ ల ద్వారా ఎదురయ్యే దారుణమైన పరిణామాల గురించి తెలియని వారు ఇంకా వీటిని వాడుతున్నారని, ఏమౌతుందిలే అని వ్యవహరిస్తే చాలా ప్రమాదకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుందని క్రిష్ణ చౌదరి హెచ్చరించారు. వీరే కాకుండా పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థలకు చెందిన హ్యాకర్లు కూడా భారత రహస్య సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.

వీరు ముఖ్యంగా జవాన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్ ల తో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేయడానికి మరో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. అనంతరం సదరు యాప్ ఇన్ స్టాల్ అవ్వగానే వారు మొబైల్ లోని కీలక సమాచారాన్ని(కాంటాక్ట్స్, మెసేజ్ లు, వీడియోలు, జీపీఎస్ లొకేషన్) హ్యాక్ చేయగలుగుతున్నారు. అందుకే ఆర్మీ అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసింది.

English summary

Don't accept facebook requests from unknown girls. Indian army officers gave a warning for facebook users. That is don't accept unknown girls friend requests in Facebook.