పిల్లల ముందు వాదులాట తగదు

Don’t argue too much

01:10 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Don’t argue too much

చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లల పై నెగెటివ్‌ ప్రభావాలు పడతాయి. ఇలా చేయడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఒక్కోసారి ఎంత కంట్రోల్‌ చేసుకున్న కోపం కట్టలు తెంచుకుంటుంది అలాంటప్పుడు ముందు వెనుక చూసుకోకుండా అరిచేసుకుంటారు. కాని తమ పిల్లలు దూరం నుండి మిమ్మల్నే నిశబ్ధంగా గమనిస్తున్నారని మీరు గ్రహించరు. అలాంటి సమయంలో చేసేదేమీ లేక మీరు బాధ పడతారు. ఇలా పిల్లలు తమ వాదులాటను గమనించారనుకోండి దాన్ని ఎలా సర్ధి చెప్పుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధ్యమైనంత వరకు పిల్లల ముందు దెబ్బలాట ఆడవద్దు. అలాగే నోటికి వచ్చిన మాటలన్నీ అనవద్దు. అవి పిల్లల మీద ప్రభావం చూపుతాయి. ఒకవేళ పిల్లల ముందు వాదులాట ఆడవలసి వచ్చినప్పుడు దానిని ఎలా సంభాళించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1/6 Pages

కోపాన్ని అదుపులో ఉంచండి !

మీరు మీ కోపాన్ని ఒక్కో సమయంలో కంట్రోల్‌  చేసుకుందాం అనుకున్నా చేసుకోలేరు. అలాంటప్పుడు మీ భాగస్వామితో వాదులాటకు దిగుతారు. ఇలాంటి సందర్బం మీ పిల్లల ముందు ఎదురైతే కనుక మీరు జాగ్రత్త వహించాలి. గట్టిగా అరిచి గోల చేయకుండా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడాలి. మిమ్మల్ని మీ పిల్లలు గమనిస్తున్నారని గుర్తు పెట్టుకుని మిమ్మల్ని మీరు సంబాళించుకుని మీ భాగ్యస్వామితో మాట్లాడాలి. మీరు గొడవ పడుతున్నట్లు కాకుండా వివరాలు కనుకుంటున్నారనే భావన మీ పిల్లలకు కల్పించాలి.

English summary

You can’t control your anger each time. Then please don’t argue too much with your partner in front of your children.