వాట్సాప్ లో అది క్లిక్ చేస్తే మీ పని అయిపోయినట్టే!

Don't click on whatsapp gold

10:37 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Don't click on whatsapp gold

సోషల్ మీడియాలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వాటితో పాటు ఎన్నో అనవసరమైనవి వస్తున్నాయి. ఇక ఈ మధ్య వాట్సాప్ లో ఓ మెసేజ్ తెగ హల్ చల్ చేస్తోంది. వాట్సాప్ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తోంది. అది డౌన్ లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్ ని గోల్డ్ కలర్ లోకి మార్చుకోవచ్చు అని దానర్ధం. ఇది వాట్సాప్ కొత్తగా పెట్టిన అప్ గ్రేడ్ వర్షన్ అంటూ వాట్సాప్ లో వెంటనే దీన్ని డౌన్ లోడ్ చేసుకోండని ఓ మెసేజ్ అందరికీ వస్తోంది. అయితే ఈ మెసేజ్ అంతా ఫేక్ తో కూడుకున్నదని అంటున్నారు. మీరు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారంటే మీ ఫోన్ లోకి 404 మెసేజ్ వస్తుంది అంటే మీ అకౌంట్ హ్యాక్ అవుతుందని, తద్వారా మీ మొబైల్ డేటా సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని చెబుతున్నారు.

ఇదొక పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సాప్ ఏదైనా రిలీజ్ చేస్తే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్ లు నమ్మవద్దని వాట్సాప్ సైతం చెబుతోంది. అందుచేత, ఒకవేళ అలాంటి మెసేజ్ వస్తే ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కాదు కూడదని ఓపెన్ చేసారో ఇక అంతే సంగతులు అని అంటున్నారు. సో ఇక మీరే ఆలోచించుకోండి.

ఇది కూడా చదవండి: 3 లక్షలు కోసం రోజంతా సెక్స్ చేస్తానని బెట్ కట్టాడు.. చివరికి ఏమైందో తెలుసా?

ఇది కూడా చదవండి: హాట్ డాన్స్ తో అదరగొట్టిన సురేఖా ఆంటీ(వీడియో)

ఇది కూడా చదవండి: నన్ను లైంగికంగా వేధించారు!

English summary

Don't click on whatsapp gold. Don't click on gold whatsapp fake link. Because hackers will hack your account and after that they can misuse your personal data and messages, photos.