మందు కొట్టాక బ్రష్ చేసారో ఇక అంతే!

Don't do brush when you take the alcohol

09:30 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Don't do brush when you take the alcohol

ఎవరి బాధ వారిది అన్నట్టు చాలా మంది మందు కొట్టేయడం కొట్టేస్తారు... అయితే అలా కొట్టాక.. ఇంటికి వెళితే ఏమవుతుందో అనే భయం వెంటాడుతుంది. ఇక వాసన రాకుండా కవర్ చేసేందుకు యాలక్కాయలో, వక్కపొడో, లవంగాలో, కిళ్లీ ఇలా వేస్తూ ఉంటారు. అయితే.. ఇలాంటి జాగ్రత్తల్లో బ్రష్ చేయడం కుడా ఒకటి. బ్రష్ చేస్తే మద్యం తాగిన వాసన అసలు రాకుండా ఉంటుందని చాలా మంది బ్రష్ కుడా చేస్తుంటారు. అయితే, పొరపాటున కూడా ఈ పని చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా బ్రష్ చేయడం వల్ల పళ్ల పై ఉండే ఎనామిల్ పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిట.

మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుందని.. తాగిన వెంటనే బ్రష్ చేసుకుంటే కనుక ఆ ఆమ్లంతో బ్రష్ చేసుకున్నట్లే అవుతుందన్నారు. పళ్లు త్వరగా పుచ్చిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో.. మందు కొట్టాక బ్రష్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈపాటికే ఇలా బ్రష్ చేసేసి ఉన్నా పర్వాలేదు ఇకనైనా జాగ్రత్త పడితే మంచిదని అంటున్నారు.

English summary

Don't do brush when you take the alcohol. Don't do brush when you take the alcohol.