రాత్రి పడుకునే ముందు జుట్టు విషయంలో చేయకూడని తప్పులు!

Don't do these mistakes on your hair when going to bed

12:34 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Don't do these mistakes on your hair when going to bed

మనిషి శరీరంలో ప్రతిభాగం ఇంపార్టెంట్. ఏదీ నిర్లక్ష్యం చేయకూడదు. జుట్టు విషయంలో కూడా అంతే. ఇక ప్రతిరోజూ డ్యామేజ్ హెయిర్ తో ఇబ్బందిపడుతున్నా, జుట్టుకు కావాల్సిన పోషణ అందిస్తున్నా, నిర్జీవంగా కనిపిస్తున్నా, జుట్టు ఎట్రాక్టివ్ గా ఉండటానికి జాగ్రత్త తీసుకోవాలి. మీకు అన్ హెల్తీ హెయిర్ ఉందంటే.. ట్రెండీ హెయిర్ స్టైల్ ఫాలో అవడం కూడా కష్టమవుతుంది. అయితే హెయిర్ డ్యామేజ్ కి చాలా కారణాలుంటాయి. పోషకాహారలోపం, హెయిర్ కేర్ పై శ్రద్ధ తీసుకోకపోవడం, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్, పొల్యూషన్ కారణంగా.. జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఇక ఏ కారణం లేకున్నా, సరే జుట్టు డ్యామేజ్ అవడానికి మీరు పాటించే హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండండి.

తడిజుట్టుతో పడుకోవడం.. రాత్రిపడుకోవడానికి ముందు తడిజుట్టుతోనే పడుకుంటే.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. దిండుపై జుట్టు అలా ఇలా తిరగడం వల్ల.. స్కాల్ప్ మాయిశ్చరైజర్ ని కోల్పోతుంది. టైట్ గా బ్యాండ్ వేసుకోవడం, రాత్రిపూట టైట్ గా పోనీటైల్ వేసుకోవడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. కుదుళ్లు బలహీనమై.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. క్లిప్స్ కూడా టైట్ గా ఉండేవి రాత్రిపూట పెట్టుకోకపోవడం మంచిది. ఎక్కువగా దువ్వుకోవడం, రాత్రిపడుకోవడానికి ముందు జుట్టుని దువ్వుకోకపోవడమే మంచిది. దువ్వడం కంటే మసాజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది.

న్యాచురల్ ఆయిల్ తో రాత్రి మసాజ్ చేయడం వల్ల రాత్రంతా పోషణ అందుతుంది. ఇలా ఎన్నో నియమాలు పాటించవచ్చు. ఇక మనం తరచూ చేసే తప్పులను సరిదిద్దుకోవాలి. వాటి వివరాల్లోకి వెళ్తే..

1/8 Pages

పిల్లో కవర్స్ వాష్ చేయకపోవడం...


ఒకే పిల్లో కవర్ ని పదే పదే వాడటం, ఎక్కువ రోజులు వాష్ చేసుకోకపోవడం వల్ల మైక్రోబ్స్ జుట్టుకి హాని చేస్తాయి. చుండ్రు, జుట్టు రాలడానికి కారణమవుతాయి. కాబట్టి శుభ్రమైన పిల్లో కవర్స్ వాడాలి.

English summary

Don't do these mistakes on your hair when going to bed