టీనేజ్ లోనే తెల్ల జుట్టు వచ్చినవారు అస్సలు చెయ్యకూడని తప్పులు!

Don't do these mistakes when you get grey hair in teenage

02:27 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Don't do these mistakes when you get grey hair in teenage

తెల్ల జుట్టు ఉందంటే, దాన్ని నల్లగా మార్చడానికి, అది కనపడకుండా చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. కానీ, తెల్ల జుట్టు విషయంలో కొన్ని పొరపాట్లు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదని, ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం ప్రతి 5 మంది మహిళల్లో ముగ్గురు తెల్లజుట్టుని పొందుతున్నారట. అది కూడా, 30లలోనే జుట్టు తెల్లబడిపోతోందట. మగవాళ్లకైతే, మరీ టీనేజ్ లోనే తెల్లజుట్టు సమస్య ఎదురవుతోందట. మొదటిసారి తెల్లజుట్టు వచ్చినప్పుడు, ఫస్ట్ రియాక్షన్ అయోమయం. దాన్ని పీకేయాలా వద్దా అనే ప్రశ్న వేధిస్తుంది. ఇంకా న్యాచురల్ డై వేసుకోవాలా, సలూన్ కి వెళ్లాలా అన్న డౌట్స్ కూడా ఉంటాయి. రకరకాల ప్రశ్నలు, జవాబులు వేధిస్తాయి. అయితే, కొన్ని పనులు మాత్రం ఏమాత్రం చేయకూడదని, సూచిస్తున్నారు. మరి తెల్లజుట్టు సమస్య ఉన్నవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పొరపాట్లు, తప్పులు ఏంటో తెలుసుకోండి.

1/13 Pages

తెల్లజుట్టు పీకకూడదు..


తెల్లజుట్టు పీకడం వల్ల మరిన్ని ఎక్కువ తెల్లజుట్టు వస్తుందని అపోహ ఉంది. అయితే న్యాచురల్ పిగ్మెంటెడ్ హెయిర్ కంటే, తెల్ల జుట్టు కొంచెం రఫ్ గా ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని లాగుతారో, అది మళ్లీ తెల్లజుట్టుగానే పెరుగుతుంది. అందుకే, తెల్లజుట్టు కనిపించినా, దాన్ని ఏమీ చేయకుండా వదిలేయాలని అంటున్నారు.

English summary

Don't do these mistakes when you get grey hair in teenage