నీళ్లు ఎక్కువ తాగినా ప్రమాదమేనట!

Don't drink more water

12:32 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Don't drink more water

నీళ్లు తాగితే మంచిదని చెబుతారు. అయితే మోతాదు మించితే అది కూడా ప్రమాదమేనని పరిశోధకులు అంటున్నారు. అసలు రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? తక్కువ నీరు తాగితే అనారోగ్య సమస్యలొస్తాయా? అలా అని అదే పనిగా నీరు తాగితే ఆరోగ్యకరమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ మెల్ బోర్న్ లోని మొనాష్ యూనివర్సిటీ సమాధానాలిచ్చింది. విక్టోరియాకు చెందిన ఈ యూనివర్సిటీ డ్రింకింగ్ వాటర్ పై సర్వే చేసింది. ఈ సర్వేలో భయంకర నిజం వెల్లడైంది. అతిగా నీరు తాగడం కూడా అత్యంత ప్రమాదకరమని తేలింది. రోజుకు 8 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యలొస్తాయని, ప్రాణాలకే ప్రమాదమని సర్వే తేల్చింది.

ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తంలో ఉండే సోడియంలో విటా లెవెల్స్ తగ్గుతాయని, దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలొస్తాయని తెలిసింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఈ సర్వే ప్రచురితమైంది. మరి నీళ్ల ప్రియులు ఇది గమనించి నడుచుకుంటే మరింత ఆరోగ్యం లేదంటే అనారోగ్యమే.

English summary

Don't drink more water