రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా? అయితే ఒకసారి ఇది చదవండి..

Don't drink water in railway stations

04:30 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Don't drink water in railway stations

రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా? అయితే.. మీ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నట్లే. రైల్వే ప్రయాణికులకు భారత్ రైల్వే శాఖ అందిస్తున్న సేవలు చాలా దారుణంగా ఉన్నాయని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకటన ద్వారా వెల్లడయింది. జాతీయ ఆరోగ్య, పర్యావరణ సంస్థ, జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో బయటపడిన పలు వివరాలను వెల్లడించింది. రైల్వే స్టేషన్లలోని తాగునీటిలో ప్రతి 100 ఎమ్ఎల్ నీటిలో 10 యూనిట్ల థర్మోటోలరెంట్ క్లోరోఫామ్ బ్యాక్టీరియా ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఈ నీటిని తాగడం వల్ల డయేరియా, ఉదర సంబంధ వ్యాధులు, గాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుందని సదరు సంస్థ తెలిపింది.

ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తెలిపింది. ఢిల్లీ, గజియాబాద్, పంజాబ్, వారణాసి తదితర ప్రాంతాలలో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉందని ఆ పరిశోధన ద్వారా తెలిసిందని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకటనలో తెలిపింది. అయితే, రైల్వే అధికారుల వాదన మాత్రం కొన్ని రైల్వే స్టేషనల్లో మాత్రమే ఇటువంటి పరిస్థితి ఉందని, కొన్ని చోట్ల నిర్వహణా లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతి స్టేషన్ లో నీటిని శుద్ధి చేసి ఉచితంగా తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కోహ్లీ ఎవరికీ రూపాయి ఖర్చు పెట్టడు.. పెద్ద పిసినారి: యువరాజ్ సింగ్

ఇది కూడా చదవండి: అక్కడ ఆడవారి కోర్కెలు తీర్చడానికి మగవారు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: ఇకనుంచి అవి లేవంట.. ఎన్టీఆర్ సంచలన నిర్ణయం!

English summary

Don't drink water in railway stations. Don't drink water in Indian railway stations. Because their is lot of chloroform bacteria in water.