ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే మీ పని అయిపోయినట్టే!

Don't keep these statues in home

11:47 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Don't keep these statues in home

ఆలయాల్లో విగ్రహాలు ఎలా వున్నా ఏమో గానీ, ఇంట్లో మాత్రం అలా వుండకూడట. ఇళ్లల్లో ఓ పూజగది ఉందంటే, ఉదయమే మిమ్మల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంచి, కాస్త ప్రశాంతతను ఇచ్చే గదిగా చెప్పవచ్చు. కానీ ఆ గదిలో మనకు ఇష్టమొచ్చినట్టు విగ్రహాలు, పటాలు ఉంచేయడం మంచిది కాదట. దానికీ కొన్ని పద్ధతులుంటాయి. ప్రత్యేకించి మనకు నష్టం కలిగించే వాటిని ముందు అవాయిడ్ చేయడం అత్యవసరం. అందులో ఒకటి ఎప్పుడూ నిలబడి ఉన్న గణేశుడు, సరస్వతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు.

1/4 Pages

నిజానికి ఇంట్లో గణేషుడు, సరస్వతి విగ్రహాలు ఉండటం అదృష్టదాయకమే. కానీ ఆ దేవుళ్లు నిలబడి ఉన్న విగ్రహాలు మాత్రం నష్టకారకాలుగా చెబుతారు. ఆ దేవుళ్లు కూర్చున్నట్టుగా ఉంటేనే శ్రేష్టం. అంతేకాదు, డబ్బులున్నాయి కదా అని పేద్ద పేద్ద విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడబడితే అక్కడ, పూజగదిలో పెట్టేయకూడదు. పది ఇంచులకన్నా పెద్దగా ఉండే విగ్రహాలు అరిష్టదాయకాలని అంటారు. అవన్నీ గుళ్లల్లో పెట్టుకోవడానికే తప్ప, ఇళ్లల్లో పెట్టుకోవడం కోసం కాదని గమనించాలి. కొంత మంది పేద్ద పేద్ద వినాయక విగ్రహాలను ఇళ్లల్లో ఆడంబరం కోసం పెడుతుంటారు.

English summary

Don't keep these statues in home