ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

Don't keep these things in your home

06:24 PM ON 14th July, 2016 By Mirchi Vilas

Don't keep these things in your home

పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో సాంప్రదాయాలు, సూచనలు, పద్ధతులు, నియమాలు పెట్టారు. వాటి వెనుక ఎంతో పరమార్ధం, ఆరోగ్య సూత్రాలు, నియమాలు ఉన్నాయి. ఇప్పుడున్న వారికి అవి ఎందుకు పెట్టారో తెలీదు, గుడ్డిగా ఆచరిస్తారు తప్ప అసలు వాటి వెనుక ఉన్న కధ ఏంటో తెలీదు. మాట్లాడితే పెద్దలు చెప్పారు అంటారు కానీ నిజానికి వారికి కూడా తెలీదు. ఉదాహారణకు ఆషాడ మాసంలో కొత్త జంట ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు, అయితే అది ఆచరిస్తారు తప్ప ఎందుకు అలా చేస్తారో వారికి కూడా తెలీదు. ఇలాంటిదే ఒకటి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం.

ఆ వివరాల్లోకి వెళితే.. ఇంట్లోని కొన్ని వస్తువులు పెట్టుకుంటే.. చాలా మంచిదని, మరికొన్ని వస్తువులు పెట్టుకుంటే మంచిది కాదని మన పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు, అలాగే.. పేదరికం వెంటాడుతుందని చెబుతోంది వాస్తుశాస్త్రం. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూఢనమ్మకంగా భావిస్తారు. మరికొంత మంది అలాంటి వస్తువులు ఉంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని అపోహపడుతుంటారు. కొన్ని వస్తువుల వల్ల ధనం కోల్పోవడం ఖాయమని.. జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే.. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

కానీ.. ఇందులోని అసలు నిజం ఏంటి ? ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి, ఏవి ఉండకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/19 Pages

18. పగిలిన అద్దాలు:


మనం మొహం చూసుకునే అద్దాలు పొరపాటుగా చెయ్యి జారి కింద పడి పగిలిపోతే కొంత మంది వెంటనే బయట పడేస్తారు. కొంత మంది పగిలిన అద్దంలోనే చూసుకుంటారు. అయితే పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు.. ప్రతికూల శక్తిని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు. అలాగే దారిద్య్రాన్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు. కాబట్టి.. పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే వెంటనే బయట పడేయండి.

English summary

Don't keep these things in your home