ఈ నెంబర్ నుండి ఫోన్ వస్తే ఎత్తకండి.. ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!

Don't lift the calls from this numbers

04:21 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Don't lift the calls from this numbers

ఉరీ సెక్టార్ లో సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేసిన ఘటన మనల్ని కలచివేసిన సంగతి తెలిసిందే. మనదేశానికి చెందిన 18 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఆ తరువాతి నుంచి కవ్వింపు చర్యలకు పాక్ పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పారా కామాండోస్ రంగంలోకి దిగి ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో కనీసం 38 ఉగ్రవాదులను ఏరిపారేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారత్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని... విశ్వప్రయత్నాలు చేస్తుంది. వాటిలో భాగంగా సోషల్ మీడియా, సెల్ ఫోన్లను అస్త్రంగా వాడడానికి సిద్ధమైంది.

1/3 Pages

ఇప్పటికే భారత యువతను తప్పుదారి పట్టించేలా కొన్ని వేల మెసేజ్ లు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాన్య మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇదంతా పాకిస్తాన్ పనే అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలాంటి మెసేజెస్ కు స్పందించకూడదని ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది. ప్రజలు కూడా ఈ విషయం పై జాగ్రత్త వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ తెలివిగా సోషల్ మీడియా దారి మూసేయడంతో పాకిస్తాన్ హ్యాకర్స్ ఇప్పుడు ఏకంగా ఫోన్ల ద్వారా కుదిరినంత ఇన్ఫర్మేషన్ రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి +92 నెంబర్ తో మొదలైన ఏదైనా నెంబర్ నుండి మీకు కాల్ వస్తే ఆ కాల్ ను ఆన్సర్ చేయకూడదని మరోసారి ఇండియన్ ఆర్మీ హెచ్చరిస్తుంది.

English summary

Don't lift the calls from this numbers