బస్టాండ్, రైల్వేస్టేషన్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టారో ఇక అంతే!

Don't put charging for your mobiles in bus stands and railway stations

06:33 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Don't put charging for your mobiles in bus stands and railway stations

ఒకప్పుడు ఫోన్ అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరికి ఇదో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇక మనం దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో అక్కడ లభించే ఛార్జర్లతో ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం. ఇది అందరికీ ఉండే అలవాటే. అయితే ఈ అలవాటు ఉంటే గనుక ఆ అలవాటుకు తక్షణం గుడ్ బై చెప్పాల్సిందే. లేకుంటే మీ ఫోన్ లో ఉన్న గుట్టు మొత్తం ఇతరులకు తెలిసిపోతుంది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ల లో నుంచి సమాచారాన్ని దొంగలించే మొబైల్ ఛార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

ఇవి మీ సమాచారాన్ని అపహరిస్తాయన్న విషయం కూడా మీకు తెలియదంటే అది అతిశయోక్తి కాదు. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో.. ఈ ఛార్జర్లలో మామూలు ఛార్జర్ కాకుండా ఓ ప్రత్యేకమైన సర్క్యూట్ ను అమర్చుతారు. ఒకసారి ఫోన్ ను ఈ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టాక తర్వాత సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఫోన్ ను యూఎస్బీ ఓటీజీ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్ యాక్టివేట్ అవ్వగానే సమాచారాన్ని మొత్తం అపహరించాలనుకునే వ్యక్తి ఇంటర్నెట్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీసిగ్నల్స్ ద్వారా ఫోన్ లోని డేటాను కాపీ చేసుకుంటారు. అంతే మీ ఫోనోలో ఉన్న మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్లకు చేరిపోతుంది.

ఇందులో మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఈ డేటా చోరీకి గురయ్యేలా హ్యాకర్లు ఈ వ్యవస్థను చాలా పకడ్బందీగా తయారు చేశారు. ఇలా పనిచేసే డివైజ్ పేరు మీమ్ దీనిని మొబైల్స్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేయడానికి, ఛార్జింగ్, బిల్ట్ ఇన్ స్టోరేజ్ వంటివి రూపించారు.

English summary

Don't put charging for your mobiles in bus stands and railway stations