బీ కేర్ఫుల్: గూగుల్లో ఈ పదాలు వెదికితే జైలు శిక్ష తప్పదట!

Don't search these keywords in google

11:08 AM ON 19th November, 2016 By Mirchi Vilas

Don't search these keywords in google

కాలం మారింది... టెక్నాలజీ వచ్చింది... ఎన్నో మార్పులు... అందుకే ఒకప్పుడంటే మనకు ఏ విషయం గురించైనా తెలియకపోతే మనకు సమీపంలో ఉన్న లైబ్రరీకో లేదంటే పేపర్, మ్యాగజైన్ వంటి వాటిని చదివో లేకపోతే ఎవర్నైనా అడిగో సదరు విషయాన్ని తెలుసుకునే వాళ్లం. కానీ ఇప్పుడలా కాదు. అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. మనకు ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్ లో వెదికి పట్టుకునేందుకు, దాని గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు అనేక సెర్చ్ ఇంజన్లు మనకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో గూగుల్ ప్రధానమైంది. దీని గురించి దాదాపు చాలా మందికి తెలుసు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలో చాలా మంది గూగుల్ సెర్చ్ సైట్ నే ఆశ్రయిస్తున్నారు.

1/5 Pages

ఏ విషయం తెలియకున్నా గూగుల్ లోకి వెళ్తే చాలు, ఇట్టే తెలుసుకునే వెసులు బాటు కలిగింది. అందుకే చాలా మంది నెటిజన్లు నిత్యం తమకు కావల్సిన సమాచారాన్ని గూగుల్ ద్వారానే పొందుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లందరూ ఒకే విషయం గురించి ఆన్ లైన్ లో వెదకరు కదా. ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి వెదుకుతారు.

English summary

Don't search these keywords in google