ఫేస్ బుక్ లాగిన్ ఉన్నప్పుడు అశ్లీల సైట్లు చూస్తే మీ పని అయిపోయినట్టే

Don't see abused sites while you are in facebook

03:54 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Don't see abused sites while you are in facebook

సోషల్ మీడియా వచ్చాక ఎందరికో ఉపయోగంగా వున్నా, కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా మంచికన్నా చెడు ఎక్కువ ఉండడం వలన లేనిపోని ఇబ్బందులు మొదలయ్యాయి. చివరకు పరిస్థితి ఎక్కడికో దారితీస్తోంది. అలాంటి సంఘటనలు కోకొల్లలు. ఉదాహరణకు అనిల్ అనే కుర్రాడు కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఓ పక్క ఆఫీస్ పని చేసుకుంటూనే ఓ టాబ్ లో ఫేస్ బుక్ మరో టాబ్ లో ఓ బూతు సైట్ ఓపెన్ చేసి చాటుగా చూసేస్తున్నాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో హమ్మయ్య అనుకుని కాస్తంత రిలాక్స్డ్ గానే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడో విషయం దాగుంది.

అదేమంటే, అతనికి తెలీకుండానే అతని భాగోతం మొత్తం ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ లో పోస్ట్ అయిది. మరుసటి రోజు నుండి అతని కొలీగ్స్ చులకనగా చూడడం మొదలుపెట్టారు. వినడానికే భయంగా ఉంది కదూ? ఇది నిజం. కొన్ని వందలసార్లు ఇలాంటివి న్యూస్ ఫీడ్ ద్వారా నా దృష్టికి వచ్చాయి. నాకున్న 5000 మంది ఫ్రెండ్స్ లో ఎవరో ఏదో అశ్లీల సైట్ లోకి వెళ్లి గడిపేస్తుంటారు. వాళ్లకు తెలీకుండానే వాళ్లేం చూస్తున్నారో న్యూస్ ఫీడ్ లో పోస్ట్ అవుతుంటాయి. డైలీ మోషన్ లాంటి వీడియో స్ట్రీమింగ్ సైట్లలో కూడా హాట్ ఆంటీ అనీ, ఇంకా అనేక పెద్దల వీడియోల టైటిల్స్ తో వాళ్లు చూస్తున్నవన్నీ నాకు కన్పించేవి.

1/5 Pages

అసలు ఎందుకిలా జరుగుతుంది?


ఫేస్ బుక్ కేవలం ఓ వెబ్ సైట్ కో, మొబైల్ యాప్ కో పరిమితం అవలేదు. దాని పరిధిని విస్తరించుకోవాలనుకుంది. అందుకే డెవలపర్ ఎపిఐ, ఫేస్ బుక్ ప్లగ్ ఇన్స్ వెబ్ సైట్ ఓనర్లకి తయారు చేసి అందిస్తోంది. వీటివల్ల ఇద్దరికీ లాభమే, ఎలాగంటే!

English summary

Don't see abused sites while you are in facebook