జనవరి 27న మాట్లాడారో ఇక అంతే

Don't Speak on January 27th of 2017

10:59 AM ON 27th December, 2016 By Mirchi Vilas

Don't Speak on January 27th of 2017

అబ్బో ఇదేదో విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా? నిజమండి బాబూ, ఇది ఓ జ్యోతిషుడు చెప్పాడు. అది ఎవరంటే, ప్రముఖ జ్యోతిష్కుడు, సిద్ధాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ. ఈయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది(2017) జనవరి 27న మౌని అమావాస్య సమస్యాత్మకమైందని, అందువల్ల ఆ రోజు అందరూ మౌనం పాటించాలని అంటున్నారు. ఏటా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్య / మౌని అమావాస్య అంటారని చెప్పారు. అయితే వచ్చే జనవరి 27న రానున్న మౌని అమావాస్య, ఏటా వచ్చే అమావాస్యలా కాకుండా చాలా సమస్యలతో కూడిందని పేర్కొన్నారు. ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలని సూచించారు. అంతసేపు మాట్లాడకుండా ఉండలేని వారు కనీసం ఆరోజు ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనంగా ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మాట్లాడితే గ్రహాల ప్రభావం వల్ల మరుసటి రోజు నుంచే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.

ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శనిగ్రహం 2017 అక్టోబర్ 26న సహజ గమనంతో ధనస్సు రాశిలోకి ప్రవేశించవలసి ఉందని, కానీ ఈ లోపే అతి గమనంతో హడావుడిగా జనవరి 26వ తేదీ రాత్రి 7-31 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుందని శ్రీనివాస గార్గేయ చెప్పారు. ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చిక రాశిలోకి జూన్ 21వ తేదీకి చేరుకుంటుందని తెలిపారు. వృశ్చికరాశిలో కొంతకాలంపాటు ఉండి సహజ గమనంతో అక్టోబర్ 26న ధనస్సు రాశిలోకి తిరిగి ప్రవేశిస్తుందన్నారు. అందువల్ల 2017వ సంవత్సరం అంత శుభప్రదం కాదని, అందువల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని గార్గేయ అంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవికి ఇచ్చే ఏడాది ఎటువంటి గండం లేదని, ఆయన సంపూర్ణ ఆయురోగ్యంగా వుంటారని శ్రీనివాస గార్గేయ చెప్పారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, కానీ ఆ ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులున్నా, పాలనకు ఎటువంటి ఆటంకాలు వుండవని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఉత్పన్నమైన సమస్యలు 2018 వరకూ ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది భూకంపాలు, విమాన ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: నిశ్చితార్ధం డేట్ ఫిక్స్ ...

ఇది కూడా చదవండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ పంచెకట్టు సందడి

English summary

January 27th of 2017 is Mouni Ammavasya. Acording to Indian Astrology we should not speak on that day just maintain silence.