ఆ డబ్బు స్వచ్చంద సంస్థలకి ఇవ్వమంటున్న

Dont Spend Money For Flower Bouquets On My Birthday Says Mohan Babu

11:11 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Dont Spend Money For Flower Bouquets On My Birthday Says Mohan Babu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటేనే ఓ విలక్షణం దాగి వుంటుంది. వున్నది వున్నట్టు మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు. ఇక మార్చి 19 అంటే అభిమానులకు పండగే. ఆరోజు మోహన్ బాబు పుట్టినరోజు. కానీ ఈ సారి ఓ నిర్ణయం తీసుకున్నాడు మోహన్ బాబు. అదేమిటో ఆయన మాటల్లోనే విందాం. తన పుట్టినరోజుకు ఎవరూ పూలదండలు, పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దనీ, వాటికి పెట్టే డబ్బును సమాజానికి సేవ చేస్తున్న ఏవైనా స్వచ్ఛంద సంస్థలకు అందజేయాలని మోహన్‌బాబు కోరారు.

‘‘1993 నుంచీ ప్రతి పుట్టినరోజునూ తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లోని పిల్లల మధ్య జరుపుకుంటూ వస్తున్నా. కల్మషంలేని పసి హృదయాలు అందించే ఆశీస్సులు నాకెప్పుడూ గొప్ప అనుభూతినిస్తాయి. అయితే ప్రతి పుట్టినరోజుకూ శుభాకాంక్షలతో పాటు వందల సంఖ్యలో పూలదండలు, పుష్పగుచ్ఛాలు అందుకుంటాను. అవి మరుసటి రోజుకు వాడిపోతాయి. వాటిని పారవేస్తాం. అందుకే వాటిని తీసుకురావద్దని కోరుతున్నా. ఇటీవల మిరాకిల్‌ ఫౌండేషన్‌ను సందర్శించా , వారు సమాజానికి అందిస్తున్న తోడ్పాటు చూసి ఇంప్రెస్‌ అయ్యాను. వారు రెండు వేల మందికి పైగా అనాథ బాలలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. నా పుట్టినరోజుకు ఖర్చుపెట్టే ప్రతి రూపాయిని ఆ ఫౌండేషన్‌కు పంపితే సంతోషిస్తాను. ఆ సంస్థకు చేసే సహాయం ఎంతోమంది బాలల జీవితాల్ని మారుస్తుంది’’ అని కలెక్షన్ కింగ్ వివరించాడు.

రాశీఖన్నా పెళ్లి కూతురాయేనే!

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

రానా దగ్గరుంటే కంట్రోల్‌ చేసుకోలేదట..

ఆయన నాలుక కోసి తెస్తే రూ కోటి ఇస్తా

Come 19th March, I grow a year younger. Many know that I have been celebrating my Birthday amongst my children of...

Posted by Dr. M. Mohan Babu on Wednesday, March 16, 2016

English summary