ఈ టైంలో ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలట!

Don't tell any bank details of you for unknown callers

10:36 AM ON 11th November, 2016 By Mirchi Vilas

Don't tell any bank details of you for unknown callers

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పెద్ద నోట్ల గొడవే కదా. ఏ నలుగురు కలిసినా నోట్ల గురించి రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే, పాత 500/- 1000/- నోట్ల రద్దుతో దేశమంతా గందరగోళంగా ఉంది. పాత నోట్లను మార్చుకునే పనిలో జనాలంతా బిజీబిజీగా ఉన్నారు. ఈ సమయాన్ని అదునుగా చేసుకొని హ్యాకర్లు చెలరేగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

1/4 Pages

కొంత మంది మన సెల్ కు ఫోన్ చేసి, పాత నోట్లు రద్దయి వాటి స్థానంలో కొత్త నోట్లు వస్తున్న తరుణంలో మీ బ్యాంక్ సంబంధిత డిటైల్స్ కావాలని, వాటిని కాస్త మాడిఫై చేయాలని చాలా వినయంగా చెప్తారు, తర్వాత మీ ఏటిఎం కార్డులోని మొదటి 6 నెంబర్లు చెప్పి, మీ పేరు చెప్పి ఈ అకౌంట్ మీదైతే ఏటిఎం మీద ఉన్న మిగితా నెంబర్లు, మీ కొత్త నోట్ల హడావుడి వార్త నిజమే కదా అని మన ఏటిఎం నెంబర్, పాస్ వర్డ్ డిటైల్స్ చెప్పేశారా ఇక అంతే సంగతులు.

English summary

Don't tell any bank details of you for unknown callers