టీవీ ఎక్కువగా చూస్తే మగవాళ్లలో ఆ లోపం తప్పదు!

Don't watch tv more than 5 hours

03:20 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Don't watch tv more than 5 hours

గతంలో ఎదో సరదాగా కాసేపు టీవీ ముందు కూర్చుని సేద దీరేవాళ్ళు. రానురాను టీవీలకు అత్తుక్కుపోయి కూర్చుంటున్నారు. పెద్దలు సీరియల్స్, పిల్లలు కార్టూన్ చానల్స్ కి అంకితమైపోతున్నారు. గంటల తరబడి టీవీ చూస్తూ, గడిపేస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదమని శాస్త్రవేత్తలు తేల్చేసారు. రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువగా టీవీ చూసే పురుషుల్లో శక్రకణాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. కోపెన్ హాగెన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. పురుషుల్లో ఇలా శుక్రకణాల సంఖ్య తగ్గడం వల్ల పిల్లలు పుట్టే యోగం కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

1200 మంది యువకులను పరిశోధకులు పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసిందట. టీవీ ఎక్కువగా చూడని వారిలో శుక్రకణాల సంఖ్య మిల్లీమీటరుకు 5.2 కోట్లుండగా, టీవీ ఎక్కువగా చూసే వారిలో సగటున 3.7 కోట్ల శుక్రకణాలే ఉన్నాయని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది. వీర్య ఉత్పత్తికి తోడ్పడే పురుష హార్మోన్ టెస్టో స్టెరాన్ స్థాయి కూడా తక్కువగా ఉందని పరీక్షలో తేలింది. టీవీ ఎక్కువగా చూసే వారిలో శారీరక శ్రమ తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా సంతాన రాహిత్య సమస్య తలెత్తే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యుక్త వయస్సుకు వస్తున్న యువకులూ తస్మాత్ జాగ్రత్త.

English summary

Don't watch tv more than 5 hours