ఇది వల్గర్ కాలం ...

Doors opened for vulgarity

11:19 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Doors opened for vulgarity

ఇదేమిటి అనుకుంటున్నారా అవునండి, బాలీవుడ్ మూవీ 'ఉడ్తా పంజాబ్' కు బోర్డు మొదట 89 కట్లను సూచించగా.. పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబకడంతో దీన్ని 13 కట్లకు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఉడ్తా పంజాబ్ పై బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పు పై సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ వ్యంగ్యంగా స్పందిస్తూ, ఈ తీర్పు ఇక వల్గర్ సినిమాలకు, అశ్లీల దృశ్యాలకు, కంటెంట్ కు కవాటాలు తెరుస్తుందన్నారు. ఈ సినిమాకు సంబంధించి తాను కేవలం బోర్డు నిబంధనలనే పాటించానని అందుచేత ఈ తీర్పు ఎవరి ఓటమిగానీ, గెలుపు గానీ కాదన్నారు. కోర్టు నిర్ణయాన్ని తాము అమలు చేయవలసి ఉంటుందని, పహ్లాజ్ నిహ్లానీ అన్నారు. సెన్సార్ బోర్డు సూచించే ప్రతి కట్ ను సవాలు చేస్తూ ప్రొడ్యూసర్లు ఇక కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ప్రారంభమవుతుందన్నారు.

ఇది కూడా చూడండి:మన తెలుగు రాష్ట్రాల చిహ్నాల గురించి మీకు తెలుసా?

ఇది కూడా చూడండి:దూమపానం చేసే వారికి సిరప్‌

ఇది కూడా చూడండి:మీ పిల్లలు జలుబుతో బాధపడుతున్నారా ?

English summary

CBFC chief Pahlaj Nihalani says court will open the doors for vulgarity.