ఇంతకీ గ్రేటర్ లో పవన్ ప్రచారం ఉందా?

Doubt On Pawan Kalyan Campaign In GHMC Elections

10:52 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Doubt On Pawan Kalyan Campaign In GHMC Elections

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ తరఫున జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం పుణ్యామా అని అనూహ్య విజయం దక్కింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా పవన్ ప్రచారానికి వస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఒకదశలో ఈ వార్తలపై ప్రతిపక్షాలు కూడా అలర్ట్ అయ్యాయి. అధికారపక్షమైన టీఆర్ఎస్ అయితే విమర్శలు గుప్పించింది. సీఎం కేసీఆర్ కూతురు - నిజామాబాద్ ఎంపీ కవిత మేకప్ తో ప్రచారానికి వచ్చి ఆ తర్వాత ప్యాకప్ చేసుకుపోతారని విమర్శించింది. కవిత విమర్శలకు ఎన్నికల ప్రచారంలోనే సమాధానం చెప్పడానికి పవన్ నిర్ణయించుకున్నారనే మాట వినవచ్చింది. అందుకే పవన్ అభిమానులు గాని , జనసేన గానీ స్పందించలేదని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ ప్రచారానికి రావడం షురూ అనిపించింది.

అయితే తాజా పరిణామాలు చూస్తే , పవన్ ప్రచారానికి వచ్చే అవకాశాలు లేవనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి రావాల్సిందిగా తాము పవన్ కళ్యాణ్ ను కోరలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తమ పార్టీ తరఫున కేంద్ర మంత్రుల ప్రచార షెడ్యూల్ మాత్రమే సిద్ధం చేసినట్లు చెప్పారు. అంటే పవన్ ని పిలుస్తున్నట్టా? లేదా? అసలు పవన్ ప్రచారానికి వస్తారా ?రారా ? పవన్ అవసరం గ్రేటర్ ఎన్నికల్లో లేదా ?.... ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

English summary

Telangana BJP Leader Kishan Reddy says that they did not asked pawan kalyan to participate in GHMC election campaign.