షాకింగ్: కెమెరాకు చిక్కిన డ్రాగన్(వీడియో)

Dragon caught to camera

12:41 PM ON 25th October, 2016 By Mirchi Vilas

Dragon caught to camera

డ్రాగన్ ఈ పేరు చెబితే చాలు అందరిలో అదో రకమైన ఉత్కంఠ. ఇంతకీ చైనా దేశానికి డ్రాగన్ అనే పేరు రావడానికి కారణం ఒకప్పుడు అక్కడ డ్రాగన్ లు సంచరించడమే. కానీ ఎవరైనా, ఎప్పుడైనా డ్రాగన్ లను చూశారా అంటే ఎవరూ చూడలేదు. కానీ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న ఓ వీడియోలో రెండు కొండల మధ్య డ్రాగన్ ఆకారంలో ఉన్న పెద్ద జీవి ఎగురుతూ కనిపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియో చైనాకు చెందిన ఎపెక్స్ ఛానల్ రికార్డ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై పలు ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.

డ్రాగన్స్ ఈ విధంగా ఉండవని, ఇది ఫేక్ వీడియో అని కొందరు ఖండిస్తుండగా, మరికొందరూ డ్రాగన్ గానే వర్ణిస్తున్నారు. మరికొందరైతే గ్రహాంతర వాసులేమోనని అభిప్రాయపడుతున్నారు. వీడియో రికార్డు చేసిన ఆపెక్స్ టీవీ యాజమాన్యం మాత్రం మార్ఫింగ్ చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నిస్తోంది. దీంతో ఈ వీడియో పలురకాల ఆసక్తికరమైన చర్చలు జరగుతున్నాయి. మీరో ఓ లుక్కెయ్యండి..

English summary

Dragon caught to camera