కరువుకి - ఐపిఎల్ మ్యాచ్ కి లింకా ?

Dravid And Gavaskar unhappy with Bombay High Court Judgement

10:16 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Dravid And Gavaskar unhappy with Bombay High Court Judgement

క్రికెట్ సంఘానికో వీరతాడు.. వేసేద్దామా..? ఎందుకంటే.. వాళ్లు కనబరిచిన సామాజిక స్పృహల గురించి విన్నవాళ్లకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంకైపోయింది. నీళ్ల దోపిడీకి పాల్పడుతోందన్న అభియోగమ్మీద.. ఐపీఎల్‌ని మరాఠీ గడ్డ నుంచి నిర్ధాక్షిణ్యంగా తరిమికొట్టేసింది బాంబే హైకోర్టు. అసలే నీళ్ల కరువుతో చచ్చిపోతుంటే.. మీరేంటి.. మీ మైదానాలేంటి అంటూ తిట్టిపంపేసింది కూడా! మీకు అభ్యంతరం లేకపోతే.. మా ఊరికొచ్చి ఆడుకోమంటూ హైదరాబాద్ హెచ్‌సీఏ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిందట.

ఇవి కూడా చదవండి: పవన్ కామెంట్స్ కు హర్ట్ అయిన బన్నీ

ఇక నీటి సమస్య కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లను తరలించాలన్న బొంబాయి హైకోర్టు ఆదేశాల పై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్లు సునీల్‌ గావస్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ స్పందిస్తూ, . కరవుకు.. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లను తరలించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న విషయం గుర్తించాలన్నారు. ‘‘నీళ్లు లేకుండా మనుషులు చనిపోతుండటం చాలా తీవ్రమైన సమస్య. ఐతే ఈ సమస్యను ఐపీఎల్‌కు ముడిపెట్టడం వల్ల దాని తీవ్రత తగ్గిపోతుంది. ఐపీఎల్‌ లేకుంటే సమస్య పరిష్కారమైపోతుందా? అలాగైతే మొత్తంగా క్రికెట్‌ ఆడటాన్నే ఆపేయండి’’ ద్రవిడ్‌ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి:బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

‘‘క్రికెట్‌ అనేది తేలికైన లక్ష్యంగా మారిపోతోంది. రైతుల జీవితాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐతే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడించనంత మాత్రాన నీటి సమస్య తీరిపోతుందా? అలాగైతే అది ఎలాగో చూపించాలి. తాము మంచి నీటిని వాడబోమని బీసీసీఐ చెప్పింది. ఫ్రాంఛైజీలు విరాళాలివ్వడానికి ముందుకొచ్చాయి. ఈ ఉద్దేశాలు మంచివే కదా. అసలు ఒక్క క్రికెట్‌ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈత కోసం.. ఇళ్ల దగ్గర తోట పనికి వాడుతున్న నీళ్ల మాటేంటి? ఇవన్నీ అలాగే కొనసాగుతాయి. ఈ ఒక్క విషయంలోనే కాదు. ఏదైనా రాజకీయం తలెత్తినా క్రికెట్‌ మీదికి దృష్టి మళ్లుతుంది. దేశాల మధ్య సంబంధాల విషయంలోనూ క్రికెట్‌ మీద చర్చ నడుస్తుంది. నీటి సమస్య దీర్ఘకాలికం. గత రెండు మూడేళ్లుగా వర్షాలు తక్కువ పడుతున్నాయి. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపించాలి. వర్షపాతం తగ్గినపుడు ఏం చేయాలో విధాన నిర్ణయాలుండాలి. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆపినంత మాత్రాన సరిపోదు’’ అని గవాస్కర్ అంటున్నాడు. మొత్తానికి కోర్టు తీర్పు పై ఈ ఆటగాళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలు ప్రాధ్యాన్యత సంతరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

పబ్ లో ఫుల్లుగా తాగి రచ్చ రచ్చ చేసిన అపూర్వ ఆంటీ

సర్దార్ పై పూరి సెట్టైర్లు

సేల్ఫీ కోసం వెళితే తన్నేసాడు

English summary

Bombay High Court Have ordered that Not to use water for Cricket matches in Maharashtra and also said that dont to play IPL matches in Maharashtra. Bombay High Court Decision was opposed by The Ex- Indian Cricket Captains Sunil Gavaskar and Rahul Dravid. They two said that we should not link water problem with Cricket.