‘డ్రీమ్‌గర్ల్‌’ ఆల్బమ్‌ ఆవిష్కరణలో ‘షోలే’ బ్యాచ్ 

Dream Girl Album Launched By Hema Malini

04:13 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Dream Girl Album Launched By Hema Malini

ఆ రోజుల్లో షోలే సినిమా అంటే అదో క్రేజ్. అందులో బిగ్ బి అమితాబ్‌బచ్చన్‌, ధర్మేంద్ర, హేమమాలిని,  నటించారు. ఇక ఇందులో విలన్ అంజాద్ ఖాన్ వేసిన గబ్బర్ సింగ్ పాత్ర అప్పట్లో సంచలనం గా నిల్చింది. ఇక ఇప్పుడు కూడా ఈ టైటిల్ తో గబ్బర్ సింగ్ తీసి పవన్ మంచి హిట్ కొట్టాడు కూడా . దీనికి సీక్వెల్ గా సర్దార్ కూడా వస్తోంది. అలాంటి షోలే సినిమాలోని నటీనటులు ఇప్పుడు  ఒకే వేదికపై కనిపించారంటే వీనుల విందే కదా .... సరిగ్గా అదే జరిగింది. హేమమాలిని ‘డ్రీమ్‌గర్ల్‌’ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో షోలే బ్యాచ్ ప్రతక్షమయ్యారు.ఈ కార్యక్రమంలో జయాబచ్చన్‌, షోలే చిత్ర దర్శకుడు రమేష్‌ సిప్పీ పాల్గొన్నారు.  బాలీవుడ్‌ నటి హేమమాలిని డ్రీమ్‌గర్ల్‌ ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఆల్బమ్‌ని షోలే మిత్రులు అమితాబ్‌బచ్చన్‌, ధర్మేంద్రలు ఆవిష్కరించారు. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. గాయకుడు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రి గా వ్యవహరిస్తున్న  బాబుల్‌ సుప్రియో దీనికి సంగీతం సమకూర్చారు. ఇందులో సుప్రియోతో కలిసి హేమమాలిని కొన్ని పాటలు పాడిందట.  హేమమాలినికి ఇష్టమైన అలనాటి నటుడు కిషోర్‌కుమార్‌ కోసం ఆమె ఈ పాటలు పాడినట్లు చెబుతున్నారు. ఇక  ధర్మేంద్ర, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పాటలు పాడాలని ఉందని చెబుతున్న హేమ మరిన్ని మజిలీలు సృష్టిస్తుందో చూద్దాం. 

1/8 Pages

English summary

Bollywood Veteran Heroine Hema Malini Launches Music Album named "Dream Girl". Actors like Dharmendra, Amitabh Bachchan, Jaya Bachchan , kailash Kher and other celebs were present at the event.