మీ డ్రీమ్స్‌కి అర్ధం తెలుసా ??

Dreams and their meanings

01:19 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Dreams and their meanings

అందరూ కలలు కంటూ ఉంటారు. కొంత మందికి వచ్చిన కలకు అర్ధం ఏమిటో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటుంది. అందుకని వచ్చిన కలని అందరితో షేర్‌ చేసుకుంటారు. అసలు కలలు ఎందుకు వస్తాయి. ప్రతి ఒక్కరూ నిద్రలో 90 నిమిషాల పాటు కలల ప్రపంచం లో విహరిస్తారు. మన మనస్సు లోలోపల దాగి ఉన్న భావాలను కొన్నికొన్ని కలల రూపంలో చూస్తూ ఉంటాం. మన కలతలు కలల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కలలు ముక్కుసూటిగా ఉంటాయి. కొన్ని కలలు ఆలోచనలకి అందనంత దూరంలో ఉంటాయి. కొన్నిటికి అర్ధాలని ఎంత వెతికిన అర్ధంకావు. అలాంటి కలలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కొంత మందికి ఒకే రకమైన కల పదేపదే వస్తూ ఉంటుంది. అసలు ఎలాంటి కలలు వస్తాయో వాటి అర్ధాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

1. పై నుండి పడటం

ఇది ఒక సాధారణ కల. చాలామందికి ఈ కల వస్తుంది. దీనికి అర్ధం ఏమిటంటే మీరు నిజజీవితంలో చాలా కఠిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని అర్ధం. నిజజీవితంలో ఎదుర్కోవాలి అనుకునే సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొనలేక పోతే ఈ కల వస్తుంది. మీరు మీ మనస్సులో సమస్యను ఎదుర్కొనలేక పోతున్నామనే భావన మిమ్మల్ని భాదించడం వలన ఈ కల మీ ముందుకు వస్తుంది. అందువల్ల ఎలాంటి సమస్యలకు తలవంచకుండా దృఢసంకల్పంతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఆ కల మీకు ఒక సూచికలాగా పనిచేయాలి. ఈ కల ఆందోళనగా ఉన్నారని సూచిస్తుంది.

English summary

Dreaming is a natural phenomenon but why is it that we have certain dreams. Every single person, all around the world, dream while they are sleep, for minimum 90 minutes.