రోజూ పరగడుపున గోరు వెచ్చని నీటితో నిమ్మరసం తాగితే..

Drink warm lemon water daily morning

01:04 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Drink warm lemon water daily morning

మనిషి అన్నాక కొన్ని నియమాలు పాటించాలి. ఆహార పానీయాల విషయంలో మరీనూ. మనకు ప్రకృతి ప్రసాదించిన ఎన్నో సహజవనరులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కూరగాయలు, పండ్లు ముఖ్యమైనవి. ఇలాంటి సహజవనరుల్లో నిమ్మకాయ ఒకటి. ఇది ఆరోగ్య ప్రదాయమని. నిమ్మ అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే దివ్యౌషధం. ముఖ్యంగా, జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించింది మరొకటి లేదని చెప్పొచ్చు. శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో నిమ్మరసం తాగడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతారు.

నిమ్మరసాన్ని రోజూ నిద్ర లేవగానే ఉదయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 2 కప్పుల నీటిని వేడి చేయాలి. ఆ వేడి నీరు గోరువెచ్చగా ఉండగా 4 అల్లం ముక్కలు నీటిలో వేయాలి. వాటితో పాటు ఒక నిమ్మకాయను అందులో పిండుకోవాలి. కొంత పెప్పర్, ఒక టీ స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కలగలిపి సేవించడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇలాచేయడం వల్ల శరీరంలో ఉండే నీటి శాతం పెరిగుతుంది. చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రిముల తాకిడికి చర్మం తట్టుకుని మృదుత్వం పొందుతుంది.

ఇది కూడా చదవండి: పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే జరిగే అనర్ధాలేమిటి?

ఇది కూడా చదవండి: మీరు చనిపోయినట్టు కల వస్తే దాని వెనక అర్ధం ఏంటో తెలుసా?

ఇది కూడా చదవండి: గరుడపురాణం ప్రకారం జీవితమంతా సంతోషంగా ఉండాలంటే ఈ 3 తప్పులు చెయ్యకూడదట!

English summary

Drink warm lemon water daily morning. Warm lemon water is very good for health. It will cure some health problems.