కాఫీ,టీ లకు ముందు నీళ్ళు తాగుతున్నారా???

Drink water before taking coffee or tea

02:25 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Drink water before taking coffee or tea

కాఫీ అంటే కొందరికి భలే ఇష్టం. ఉదయం నిద్రలేచాక, కాఫీ పడందే కొందరికి బండి నడవదు. మరి కాఫీ మహిమ అలాంటిది. వాస్తవానికి శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలను భావిస్తారు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు. మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. అయితే ఇల్లు, ఆఫీస్, హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ, టీలు తాగినప్పుడు వాటికి ముందుగా మనలో అనేక మంది నీళ్లు తాగుతారు. అలా ఎందుకు తాగుతారు? అసలు ఎందుకు తాగాలి? తెలుసుకుందాం రండి.

1/3 Pages

రసాయనశాస్త్రంలో ఆమ్లాలు(యాసిడ్స్), క్షారాలు(ఆల్కలైన్) అని ద్రవాలను విడదీసే రెండు విభాగాలు ఉన్నాయి. అయితే ఏదైనా ఒక ద్రవం ఆమ్లమా, క్షారమా అని తెలుసుకునేందుకు మాత్రం పీహెచ్ విలువ ఉపయోగపడుతుంది. పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు. ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. అందుచేత కాఫీ, టీలు ఆమ్లత్వాన్ని(యాసిడిక్) కలిగి ఉంటాయి.

English summary

Drink water before taking coffee or tea