వైజాగ్ లో డ్రైవ్ ఇన్ థియేటర్: కారులో కూర్చునే సినిమా చూడొచ్చు

Drive in theatre in Vizag

03:54 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Drive in theatre in Vizag

డ్రైవ్ ఇన్ థియేటర్ గా పేరుపొందిన డ్రైవ్ ఇన్ థియేటర్ త్వరలో వైజాగ్ నగరం సొంతం కానుంది. కారు దిగకుండా, కాలు కింద పెట్టకుండా థియేటర్ కు వెళ్లి సినిమా చూసే అవకాశం వైజాగ్ ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. కుటుంబంతో పాటు కార్లోనే కూర్చుని హాయిగా సినిమా చూడొచ్చు. తినడానికి ఏం కావాలన్నా కారు దగ్గరకే వస్తాయి. ముంబై, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతా వంటి నాలుగు నగరాల్లో మాత్రమే ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి థియేటర్ ఏపీకి రానుంది. విదేశీ పరిజ్ఞానంతో విశాఖ ఎయిర్ పోర్టుకు సమీపంలో షీలానగర్ వద్ద ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ ను నిర్మిస్తోంది.

ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలో ఈ ధియేటర్ ప్రారంభం కానుంది. ఇక ఈ థియేటర్ ను ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 100 కార్లు పట్టేలా ఈ థియేటర్ ఉంటుంది. 90 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో స్క్రీన్ ఉంటుంది. ఇక్కడే రెస్టారెంట్ సౌకర్యం ఉంటుంది. ముందుగా వచ్చే పిల్లలు ఉచితంగా ఆడుకునేందుకు రూ. 80 లక్షల్లో క్రీడా పరికరాలు ఉంటాయి. ప్రతిరోజూ ఫస్ట్ షో, సెకండ్ షో ప్రదర్శిస్తారు. తెరపై బొమ్మ కనిపించినా.. కారులోని ఎఫ్ఎమ్ ద్వారా మాటలు, పాటలు వినొచ్చు.

English summary

Drive in theatre in Vizag