షిర్డీ సాయిని పూజించడం వలనే కరువు వచ్చిందట!

Droght because of worshiping Sai Baba

10:46 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Droght because of worshiping Sai Baba

తొలి నుండి షిర్డీ సాయిబాబా పై ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వరూపనంద స్వామి విరుచుకుపడడం, దీని పై సాయి భక్తులు విరుచుకుపడడం తెలిసిందే. అయినా ఆయన మాత్రం తన వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు. తాజాగా మరోసారి.. షిర్డీ సాయి పై స్వరూపనంద స్వామి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి. మహారాష్ట్రలో సాయిని పూజించడం వల్లే రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్నారు. ప్రత్యేకించి షిర్డీలో సాయిబాబాకు ఆరాధనలు చేయడం వల్లే కరువు, నీటి కొరత, చావులు ఏర్పడుతున్నాయని ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక ఫకీర్ కి పూజలు చేయడం మూర్ఖత్వమని ఆయన మండిపడుతున్నారు.

అలానే శని సింగనాపూర్ లోని శనీశ్వరాలయం ఆలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించడం సరికాదని స్వరూపనంద స్వామి తెగేసి చెబుతున్నారు. సనాతన హిందూ సంప్రదాయానికి ఇది విరుద్దమని అన్నారు. అలా మహిళలను గర్భగుడిలోకి అనుమతిస్తే.. భవిష్యత్ లో అత్యాచారాలు పెరుగుతాయని శంకరాచార్య స్వరూపనంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడంతో స్వరూపనంద పై బాబా భక్తులు మండి పడుతున్నారు. దేవుడి పై ఎవరి నమ్మకం వారిదని.. బాబా పై వ్యాఖ్యలు సరికాదని భక్తులు స్పష్టం చేస్తున్నారు.

English summary

Droght because of worshiping Sai Baba. Shankaracharya Swami Shri Swaroopanand says that drought in Mumbai because of worshiping Sai Baba.