కరువు సాయం మంజూరు

Drought Fund Released By Government

06:59 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Drought Fund Released By Government

కరవు సహాయనిధి కింద ఆయా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మహర్షి తదితరులు పాల్గొన్న సమావేశంలో రాష్ట్రాల్లో చేపట్టిన కరవు సహాయ చర్యలపై సమీక్షించారు. కరవు బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. వరదల్లో చెన్నై తీవ్రంగా నష్టపోయిన నేపధ్యంలో తమిళనాడుకి ఎక్కువ నిధులు మంజూరయ్యాయి. తమిళనాడు కి రూ.1,773 కోట్లు, రాజస్థాన్‌ కి రూ.1,177 కోట్లు , జార్ఖండ్‌ కి రూ.336 కోట్లు, అసోంకి రూ.332.57 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.280.19 కోట్లు , హిమాచల్‌ప్రదేశ్‌ కి రూ.170.19 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.

English summary

Central Government to release Drought Fund to States od India.1773 Crores of Amount to be released for Tamilnadu,1177 crores for Rajasthan,336 crores to Jharkhand,332.57 crores for Assam,290.19 crores for Andhra Pradesh,170.19 crores for Himachal Pradesh.