దారుణం.. పాఠశాల పిల్లలకు డ్రగ్ చాక్లెట్లు అమ్మేస్తున్నారు!

Drugs chocolates is selling to school children

05:24 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Drugs chocolates is selling to school children

నేరాలకు, ఘోరాలకు అంతులేని రోజులుగా మారాయి. తాజాగా కేరళ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు డ్రగ్ చాక్లెట్లను విక్రయిస్తున్న బాగోతం ఎక్సైజ్ అధికారుల దాడుల్లో వెలుగుచూసింది. సైకోట్రోపిక్ ఔషధాలు, వివిధ మత్తు పదార్థాలు, డ్రగ్స్ కలిపిన మాత్రలు, చాక్లెట్ల రూపంలో పాఠశాల పిల్లలు లక్ష్యంగా విక్రయిస్తున్నారని తేలింది. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్, విక్రయాలపై అధికారులు నిఘా పెంచడంతో వాటిని చాక్లెట్లలో కలిపి పాఠశాలల్లో పిల్లలకు విక్రయిస్తున్నారని వెల్లడైంది. దీంతో ఎక్సైజ్ అధికారులు డ్రగ్ చాక్లెట్ విక్రయాలపై దృష్టి సారించారు. పదిరోజుల క్రితం పాలక్కాడులో ఎక్సైజ్ పోలీసులు మారువేషాల్లో వచ్చి డ్రగ్స్ కలిపిన 24 మౌత్ స్ర్పేలను స్వాధీనం చేసుకున్నారు.

4-అంగుళాల సీసాల్లో స్ట్రాబెర్రీ, నారింజ, యాపిల్ రుచులు కలిగిన డ్రగ్స్ మౌత్ స్ప్రేలను స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ సులేష్ కుమార్ చెప్పారు. చైనా తయారు చేసిన ఈ డ్రగ్ ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్నారని తేలిందన్నారు. కోజికోడ్ లో ఎక్సైజ్ అధికారులు ఓ ఆలయ సమీపంలో డ్రగ్ తో తయారు చేసిన 705 నిట్రజేపం మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ మాత్రలు పాఠశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. మొత్తంమీద డ్రగ్ చాక్లెట్లు, మాత్రలకు పాఠశాల విద్యార్థులు అలవాటుపడుతున్నారని అధికారులు అంటున్నారు.

English summary

Drugs chocolates is selling to school children