ఇక్కడ జైలు ఎందుకు కిక్కిరిసి పోయిందో తెలిస్తే షాకవుతారు!

Drugs maphia in Philippines

12:43 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Drugs maphia in Philippines

డ్రగ్స్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అన్ని దేశాలకు మెల్లిగా డ్రగ్స్ సంస్కృతి పాకిపోతోంది. మాఫీయా ముఠాలు తయారవుతున్నాయి. అయితే ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడి పేరు చెబితే చాలు ఇప్పుడు డ్రగ్ వ్యాపారులు, వ్యసనపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దేశం నుంచి డ్రగ్స్ ను దూరం చేస్తానని ప్రతినబూనిన అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మూడు నెలల్లో దాదాపు 3,700 మందిని దారుణంగా చంపేశారు. జూన్ నుంచి మూడు నెలల పాటు వీధుల్లో రక్తం పారించారనే చెప్పాలి. డ్రగ్ వ్యతిరేక ఆపరేషన్ ఒప్లాన్ టోఖంగ్ ప్రారంభించాక ఇన్ఫార్మర్ల ద్వారా డ్రగ్ వ్యాపారులు, వాటికి బానిసలవుతున్నవారిని గుర్తించారు. ఇంటింటికీ వెళ్లి అటువంటి వారిని పట్టుకున్నారు. దొరికిన వారిని దొరికినట్టు చంపేశారు.

దీంతో చాలామంది భయంతో వణికిపోయారు. వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో జైళ్లన్నీ వీరితో కిక్కిరిసిపోయాయి. ఈ ఫోటో అదే. మరోవైపు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న అధ్యక్షుడి పేరు క్రమంగా పెరగసాగింది. ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే డ్రగ్స్ పేరుతో వేలాదిమందిని పొట్టనపెట్టుకోవడంపై మాత్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

English summary

Drugs maphia in Philippines