మందుబాబుల దూకుడుకి వీళ్ళు బలైపోయారు

Drunk And Drive Accident Victim Ramya Dead

11:49 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Drunk And Drive Accident Victim Ramya Dead

నేరానికి తగ్గ శిక్షలు లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్టించుకునేవాడు ఎవడులే అనే గర్వం మనుషులకు భయం లేకుండా పోతోంది. మందుకొట్టి డ్రైవ్ చేయొద్దు మొర్రో అంటూ పోలీసులు మొత్తుకున్నా, రవాణాశాఖ ఎన్ని ప్రకటనలు చేసినా ఫలితం ఉండడం లేదు. అందుకే వాళ్ళు ఫుల్లుగా మందుకొట్టి రోడ్డుమీద చెలరేగిపోవడంతో ఓ ఫ్యామిలీ నామరూపాల్లేకుండా పోయింది. ఆ ఇంటికి యజమానిని, 8 ఏళ్ల చిన్నారిని పొట్టన బెట్టుకున్నారు. ఇల్లాలిని, ఆ ఇంటికి పెద్దదిక్కుని ఆస్పత్రి పాలు చేశారు. ఆ కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని విషాదం మిగిల్చారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే,

1/6 Pages

హైదరాబాద్ పంజాగుట్ట కారు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య వారంరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయింది. శనివారం మృతి కన్నుమూసింది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రమ్య బ్రెయిన్ డెడ్ అయి గత 9 రోజులుగా కోమాలో ఉంది. రమ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.

English summary

Drunk And Drive Accident Victim 9 Year old Baby Ramya was died yesterday in hospital and postmortem was done in Osmania hospital and cremation was done in Amberpet burial ground.