ఫుల్లుగా తాగొచ్చిన పోలీసు .. బట్టలిప్పి ..

Drunk Cop Abuses Undresses Dances In Office

12:15 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Drunk Cop Abuses Undresses Dances In Office

సమాజంలో అన్ని వ్యవస్థలు ఎలా ఉన్నాయో పోలీసు వ్యవస్థ అలానే వుంది. క్రమశిక్షణ కొరవడి ఇష్టా రాజ్యంగా ప్రవరిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమంటే, ముంబై లో ఫుల్లుగా తాగొచ్చిన ఓ పోలీసు రచ్చ రచ్చ చేసాడట. నేరుగా పోలీసు కమిషనర్ కార్యాలయంలోకి ప్రవేశించి నానా దుర్భాషలాడడమే కాకుండా ఆఫీసులో విధ్వంసం సృష్టించాడు. అద్దాలు పగలగొట్టాడు. బట్టలిప్పి డ్యాన్సులేశాడు. ఈ నెల 15న ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. వినోద్ టేడే అనే కానిస్టేబుల్ ను అడిషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్(దక్షిణ) ప్రతాప్ డిగావకర్ కార్యాలయంలో ఎస్కార్టుగా అధికారులు పోస్టింగ్ ఇచ్చారు.

ఘటన జరిగిన రోజు సాయంత్రం పూటుగా మద్యం తాగిన కానిస్టేబుల్ వినోద్ సీపీ కార్యాలయానికి తూలుతూ వచ్చాడు. వచ్చీ రావడంతో అక్కడున్న వారిని దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. నిలువరించేందుకు ప్రయత్నించిన వారినీ వదల్లేదు. కార్యాలయంలో ఉన్న మొక్కలను ధ్వంసం చేశాడు. కుండీలు పగలగొట్టాడు. రాయితో కార్యాలయం అద్దాలను ముక్కలు చేశాడు. అనంతరం యూనిఫామ్ విప్పేసి డ్యాన్సు చేశాడు. ఈ తతంగం మొత్తం అరగంటపాటు సాగింది. అనంతరం అతడిని బలవంతంగా పట్టుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చాలా ఎక్కువ మోతాదులో ఆయన మద్యం తాగినట్టు వైద్యులు నిర్ధారించారు. కమిషనర్ కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన వినోద్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి కానిస్టుబుళ్ల వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అతడిని సస్పెండ్ చేయడం ద్వారా ఇటువంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని అందులో పేర్కొన్నారు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే, బతికి బయట పడే మార్గం ఇదే

ఇది కూడా చూడండి: మనిషి నూరేళ్లు బ్రతకాలంటే ఇవి పాటించాల్సిందే!

ఇది కూడా చూడండి: మ్యాగ్ జైన్ కోసం అందాలు ఆరబోసిన రకుల్!

English summary

Drunk Cop Abuses Undresses Dances In Office.