తాగి.. అలా ..42 గోర్రెల్లని

Drunk driver to kill sheep

05:22 PM ON 21st November, 2015 By Mirchi Vilas

 Drunk driver to kill sheep

తాగి వాహనాలను నడపడం చట్టవిరుద్దం అని అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్నిసరిగా పాటించే వారు కొందరే. తాగి వాహనాలను నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తాయి. దాని వల్ల ప్రాణాలకే ముప్పని తెలిసికూడా కొంతమంది మారరు. వీరి వల్ల వీరికే కాకుండా తోటి వారికి కూడా ప్రమాదమే.

వివరాల్లో కి వెళితే కొలోరాడో కి చెందిన లిన్ ఎన్ మైఖేల్ అనే 47 ఏళ్ల వ్యక్తి తాగి వాహనాన్ని నడపడానికి పూనుకున్నారు. అలా వీదుల్లో వెళుతుండగా ఒక గొర్రెల మందను డీ కొనడంతో ఆ గొర్రెల పాలిట మృత్యువాతగా మారింది. 38 గొర్రెలు అక్కడికి అక్కడే మరణించాయి. తదుపరి మృత్యు సంఖ్య 42 కి పైగా చేరుకుంది. అధికారులు దర్యాప్తు ప్రకారం కారు ని ఆ గొర్రెల మీదుగా తొక్కుకుంటూ పోయారని, చక్రాలు స్కిడ్ అయిన గుర్తులు ఎక్కడా లేవని, అంటే మైఖేల్ వాహనాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని వారు పేర్కొన్నారు. ఈ దారుణాన్ని ఒడికట్టిన మైఖేల్ కి న్యాయస్థానం ఆ గొర్రెల యజమానికి నష్ట పరిహారం చెలించమని తీర్పుని ఆదేశించింది. పరిహారం లబిస్తేనేం అనవసరం గా నిండు ప్రాణాలను బలికొన్నారని జంతుప్రియుల అభిప్రాయం.

English summary

Drunk driver to kill sheep.47 year old Michel drunk. He drives a car to kill sheep.38 sheep were killed immediately