పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొన్నందుకు దేశ బహిష్కారం

Dubai Court Expulsion Young Couple For Doing Romance Before Marriage

11:26 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Dubai Court Expulsion Young Couple For Doing Romance Before Marriage

ఇలా జరిగింది సాంప్రదాయ భారత దేశంలో కాదు. దుబాయ్ లో .. వివాహం చేసుకోకుండా శృంగారంలో పాల్గొన్న జంట దేశ బహిష్కారం శిక్షను ఎదుర్కొంటోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, 28 ఏళ్ళ అమెరికన్ ఉద్యోగి, 22 ఏళ్ళ పాకిస్థానీ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికి ముందే సెక్స్ లో పాల్గొనడంతో ఆమె గత మేలో గర్భవతి అయింది. ప్రసవం కోసం అంబులెన్స్ ను పిలిచి ఆసుపత్రికి వెళ్లింది. ఆసుపత్రి అధికారులు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని వాకబు చేశారు. దానికి ఆమె సరైన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులు ఉప్పు అందించాయి.

ఆ గర్భవతి ఓ కళాశాల విద్యార్థిని. తాను అమెరికన్ యువకుడి ప్రేమలో పడ్డానని ఆమె పోలీసులకు తెలిపింది. కొన్నాళ్ళు తాము ప్రేమించుకోవడంతో తాను గర్భవతినయ్యానని చెప్పింది. దుబాయ్ మెరీనాలో ఇద్దరం ఒకరికొకరు ఇష్టపడి, సమ్మతితో శృంగారంలో పాల్గొన్నామని తెలిపింది. ఆ యువకుడు తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడని , తాను అతని తల్లితో కూడా మాట్లాడానని తెలిపింది. ఈ విషయాన్ని అమెరికన్ యువకుడు కూడా అంగీకరించాడు.

ఈ జంటను దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరూ పెళ్ళి కాకుండా సెక్స్ లో పాల్గొన్నారంటూ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తన క్లయింట్లు నేరపూరిత మనస్తత్వంతో వ్యవహరించలేదని ఈ జంట తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. షరియా కోర్టులో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారని వివరించారు. అయినప్పటికీ వీరిద్దరినీ కోర్టు దోషులుగా ప్రకటించింది. మూడు నెలల జైలు శిక్ష విధించింది, త్వరలోనే దేశం నుంచి పంపించేయబోతున్నారు. దీనిపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్త్యం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:ఇది అలాంటి ఇలాంటి బస్సు కాదు .. ఏమిటో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఇవి కూడా చదవండి:మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

English summary

A 28 year old aged American man and 22 year old Pakistani girl student were loved each other and they decided to do to romance and due to that the Pakistani girl got pregnant before marriage and due to that Dubai court ordered the police to put them in jail for three months and throw them away from the country.